సాధారణంగా ఏదైనా ప్రమాదాలు, లేదా వ్యాధి కారణంగా శరీర అవయవాలను కోల్పోతుంటారు. అటువంటి వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా కొత్త అవయవాలను అమర్చుతారు. అవయవ దానం చేసే దాతలు దొరకడం నుంచి.. ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ పూర్తవడం వరకు చాలా సమస్యలు వస్తాయి. అవయవాలు దానం చేసే వారు లభించినా అది సరిపోతుందో లేదో చూడటం, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా చూడటం అవసరం. అయితే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానాన్ని పునఃపరిశీలించే సామర్థ్యం ఉన్న ల్యాబ్ బేస్డ్ ప్రత్యామ్నాయాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Indian Institute of Science) బెంగళూరు శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు.
వ్యాధి లేదా గాయం వల్ల దెబ్బతిన్న అవయవాల(Organs)ను ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా దాతల నుంచి తీసుకొన్న ఆరోగ్యకరమైన అవయవాలతో రీప్లేస్ చేయవచ్చు. అయితే ఇందులో ఇన్‌ఫెక్షన్ ప్రమాదం, అవయవాల కొరత, గ్రహీత రోగనిరోధక వ్యవస్థ వాటిని రిజెక్ట్ చేయడం.. వంటి లిమిట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సురక్షితమైన ల్యాబ్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్‌ను అభివృద్ధి చేయాలని టిష్యూ ఇంజనీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవలి సంవత్సరాలలో 3D-ప్రింటింగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సంక్లిష్టమైన భాగాల ఫ్యాబ్రికేషన్ సాధ్యమైందని IISc తెలిపింది. టిష్యూ ఇంజనీరింగ్ బయో-ఇంక్స్ అనే బయోమెటీరియల్స్‌ను సృష్టించి కణజాలం, అవయవ పునరుత్పత్తిపై దృష్టి పెడుతుంది.
‘బయో-ఇంక్స్‌లో కల్చర్డ్ సెల్స్, హైడ్రోజెల్ వంటి బయో కాంపాజిబుల్ మెటీరియల్స్ ఉంటాయి. అవి మార్పిడి చేసిన కణజాలానికి అవసరం. 3D ప్రింటెడ్ స్కాఫోల్డ్స్ అనేవి మానవ కణజాలాలకు స్ట్రక్చరల్, పంక్షనల్ కంపాటబుల్‌గా ఉంటాయి. ఇవి మృదు కణజాలాల నుంచి ఎముక వరకు ట్రాన్స్‌ప్లాంట్ చేసిన అన్ని కణజాలాలకు అనుకూలంగా ఉంటాయి’ అని IISc తెలిపింది.
గతంలో, డిజిటల్ లైట్ ప్రాసెసింగ్-బేస్డ్ 3D బయోప్రింటింగ్ ప్రయత్నించారు. ఇందులో UV లైట్ స్కాఫోల్డ్‌లను ఉత్పత్తి చేయడానికి స్థూల కణాలను ఎంపిక చేసి క్రాస్‌లింక్ చేస్తుంది. ఈ సాంకేతికత సంక్లిష్ట నిర్మాణాలను అధిక రిజల్యూషన్‌లో ప్రింట్ చేయగలిగినప్పటికీ, ఇది UV లైట్‌ను ఉపయోగిస్తుంది. ప్రింటింగ్ సమయంలో కణాలలో DNA దెబ్బతింటుందని IISc తెలిపింది. మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ కౌశిక్ ఛటర్జీ, అతని బృందం కనిపించే బ్లూ లైట్ రేడియేషన్‌ని ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించారు.
‘ఈ కొత్త టెక్నాలజీ టిష్యూ మైక్రో ఎన్విరాన్‌మెంట్‌ను అనుకరించే టిష్యూ స్కాఫోల్డ్స్ నిర్మింస్తుంది. ఇటీవల నిర్వహించిన రెండు అధ్యయనాల్లో ఈ టెక్నాలజీతో మంచి ఫలితాలు వచ్చినట్లు తేలింది. ప్రోటీన్లు, పాలీశాకరైడ్స్ నుంచి టిష్యూ స్కాఫోల్డ్స్ తయారు చేయడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించారు’ అని IISc తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Medical, Organic Farming, Scientists