శకటాల ఎంపికలో రాజకీయం లేదు.. కేంద్రం క్లారిటీ

రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే శకటాల ఎంపిక ఓ క్రమబద్ధంగా జరుగుతుంది. కళలు, సంస్కృతి, పెయింటింగ్, శిల్పులు, సంగీతం, ఆర్కిటెక్చర్, కొరియోగ్రఫీ నిపుణుల కమిటీ వాటిని ఎంపిక చేస్తుంది.

news18-telugu
Updated: January 2, 2020, 8:28 PM IST
శకటాల ఎంపికలో రాజకీయం లేదు.. కేంద్రం క్లారిటీ
రిపబ్లిక్ డే పరేడ్‌లో శకటం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసే శకటాల విషయంలో ఎలాంటి రాజకీయాలు, పక్షపాతానికి చోటు లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, అసంబద్ధమైన అంశాలను చూపుతూ కేంద్రంపై నెపం నెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర శకటాలకు స్థానం దక్కలేదు. అయితే, దీని వెనుక కుట్ర ఉందని, కావాలని, పక్షపాత ధోరణితోనే కేంద్ర ప్రభుత్వం తమ శకటాలను ఎంపిక చేయలేదని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆరోపించాయి. అయితే, అవన్నీ తప్పుడు అభిప్రాయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణించాయని, మహారాష్ట్రలో మంత్రి పదవులు దక్కని వారితో అసంతృప్తి నెలకొందని, వాటి నుంచి దృష్టి మళ్లించడానికి ఆయా ప్రభుత్వాలు శకటాల పేరుతో రాజకీయం చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తోంది.

రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే శకటాల ఎంపిక ఓ క్రమబద్ధంగా జరుగుతుంది. కళలు, సంస్కృతి, పెయింటింగ్, శిల్పులు, సంగీతం, ఆర్కిటెక్చర్, కొరియోగ్రఫీ నిపుణుల కమిటీ వాటిని ఎంపిక చేస్తుంది. 2020 సంవత్సరానికి గాను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు నుంచి మొత్తం 56 శకటాలు వచ్చాయి. అందులో 32 వాటిని నిపునుల కమిటీ ఎంపిక చేసింది. అందులో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల శకటాలకు కూడా చోటు దక్కలేదు. బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలకు (మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పంజాబ్) చెందిన శకటాలు కూడా ఎంపికయ్యాయి.

First published: January 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు