హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit Shah: ‘మోదీ 2019 కంటే ఎక్కువ సీట్లతో 2024లో ప్రధాని అవుతారు..’ రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో అమిత్‌ షా

Amit Shah: ‘మోదీ 2019 కంటే ఎక్కువ సీట్లతో 2024లో ప్రధాని అవుతారు..’ రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో అమిత్‌ షా

రైజింగ్ ఇండియా సమ్మిట్ లో అమిత్ షా

రైజింగ్ ఇండియా సమ్మిట్ లో అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. మోదీ 2024లో కూడా ప్రధాని అవుతారని, 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తారని తెలిపారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Amit Shah: నెట్‌వర్క్ 18, పూనావాలా ఫిన్‌కార్ప్ సంస్థల ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రారంభమైన ‘రైజింగ్ ఇండియా సమ్మిట్-2023’(Rising india summit)లో ప్రముఖులు పాల్గొంటున్నారు. మార్చి 29, బుధవారం నాడు ప్రారంభమైన సదస్సులో.. తొలిరోజు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జైశంకర్, అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amith shah) మాట్లాడుతూ..నరేంద్ర మోదీ(Narendra modi) 2024లో కూడా ప్రధాని అవుతారని, 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తారని తెలిపారు.

2024 సార్వత్రిక ఎన్నికలు 'మోదీ వర్సెస్ రెస్ట్' అన్నట్లు మారుతాయా అని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేపై ‘యునైటెడ్ అపోజిషన్’ తలపడటాన్ని షా ఎగతాళి చేశారు. ‘ఈ చర్చలన్నీ కేవలం TRPలను పెంచుతాయి. విపక్షాల ఐక్యత ప్రశ్నే లేదు.’ అని పేర్కొన్నారు.

‘చంద్రశేఖర్ రావు, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ , సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్- ఈ నలుగురు మోదీ వర్సెస్ రెస్ట్ ఫార్ములా కింద కలిశారని అనుకుందాం. చంద్రశేఖర్ రావు ఉత్తరప్రదేశ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తే, దాని వల్ల ఎలాంటి తేడా వస్తుంది? మమతా బెనర్జీ తెలంగాణలో ర్యాలీ నిర్వహిస్తే తేడా వస్తుందా? లేదా అఖిలేష్ యాదవ్ బెంగాల్‌లో సమావేశం నిర్వహిస్తే, దాని వల్ల ఎలాంటి తేడా వస్తుంది?’ అని అమిత్ షా ప్రశ్నించారు.

UPA హయాంలో.. మోదీని ఇరికించాలని CBI నాపై ఒత్తిడి తెచ్చింది.. అమిత్ షా వ్యాఖ్య

ఈ పార్టీలు, నాయకులు తమ తమ రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీతో పోరాడుతున్నారని అమిత్‌ షా చెప్పారు. ‘ఈ ఐక్యతకు అర్థం లేదు. వారు ఒకరినొకరు నాయకులుగా పరిగణించరు, ఒకరికొకరు సీట్లు కేటాయించడానికి ఇష్టపడరు. గత సార్వత్రిక ఎన్నికల కంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి. 2019 కంటే ఎక్కువ సీట్లతో 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతార’ని హోంమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

“పశ్చిమ బెంగాల్‌లో మా సీట్ల సంఖ్య పెరుగుతుందని నేను గతంలో చెప్పినప్పుడు, ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పింది చేశాం. ఒడిశా , తెలంగాణలో కూడా మా సీట్ల సంఖ్యను పెంచుకున్నాం. మా పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. ప్రధాని మోదీ ఖ్యాతి భారతదేశంలోని మారుమూల గ్రామం నుంచి రాజధాని ఢిల్లీ వరకు వ్యాపించింది” అని అమిత్ షా తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు.. తమిళనాడులో బీజేపీ బలహీనంగా ఉందని షా అంగీకరించారు. ‘మేము చాలా గ్రామాలు, బూత్‌లకు చేరువ అవుతున్నాం. మేము ఎక్కడ బలహీనంగా ఉన్నామో, అక్కడ మాకు మిత్రపక్షాలు ఉంటాయి’ అని చెప్పారు.

First published:

Tags: Amit Shah, CM KCR, Mamata Banerjee, Pm modi

ఉత్తమ కథలు