Home /News /national /

OPINION POLLS OF MAJORITY SURVEYS PREDICT BJP WILL UTTAR PRADESH AGAIN WITH COMFORTABLE MAJORITY AK

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో గెలుపెవరిది ? సర్వేలు ఏం చెబుతున్నాయి ? బీజేపీకి నిజంగానే ఎదురుగాలి వీస్తోందా ?

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం

Uttar Pradesh Opinon Polls: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022కి సంబంధించి వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు అభిప్రాయ సేకరణలను నిర్వహించాయి. వాటికి సంబంధించిన ఫలితాల్లో ఎక్కువశాతం అధికార పార్టీకే అనుకూలంగా వచ్చాయి.

    త్వరలోనే దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ మీదే నెలకొంది. ఢిల్లీకి వెళ్లే మార్గం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. యూపీ అసెంబ్లీ ఎన్నికలను మినీ లోక్‌సభ ఎన్నికలు అని కూడా పిలవడానికి ఇదే కారణం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022కి సంబంధించి వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు అభిప్రాయ సేకరణలను నిర్వహించాయి. వాటికి సంబంధించిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక్క డిబి లైవ్ మాత్రమే బీజేపీకి 144 నుంచి 152 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది మినహా అన్ని ప్రధాన ఏజెన్సీలు బిజెపికి 200 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేసింది. పోల్‌ ఆఫ్‌ పోల్స్‌లోనూ బీజేపీకి 221 నుంచి 231 సీట్లు వస్తాయని తేలింది. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అన్ని సర్వేలు అంచనా వేశాయి. మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ వరుసగా మూడు, నాలుగో స్థానంలో ఉండనున్నాయి.

    ముందుగా పోల్ ఆఫ్ పోల్స్ గురించి మాట్లాడితే.. ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి 221 నుంచి 231 సీట్లు వస్తాయన్నది ఓ అంచనా. ఇదే నిజమైతే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ లభించినట్టే. అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీకి 147 నుంచి 157 సీట్లు వస్తాయి. పోల్ ఆఫ్ పోల్స్ ఫలితాల ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ యూపీలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. మాయావతి సారథ్యంలోని బీఎస్పీకి 7 నుంచి 13 సీట్లు, కాంగ్రెస్‌కు 5 నుంచి 9 సీట్లు రావచ్చని అంచనా. పోల్ ఆఫ్ పోల్స్ ఫలితాల ప్రకారం... 2022 UP అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ వరుసగా మూడు, నాలుగో స్థానంలో నిలుస్తాయి.

    ఉత్తరప్రదేశ్ ఓపీనియన్ పోల్స్ ఫలితాలు


    సి ఓటర్, ఇండియా టీవీ ఇన్ గణాంకాలు
    సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీకి 223 నుంచి 235 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో ఎస్పీకి 145 నుంచి 157 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఎస్పీ, కాంగ్రెస్‌లకు వరుసగా 8 నుంచి 16, 3 నుంచి 7 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇందులో బీజేపీకి 230 నుంచి 235 సీట్లు, ఎస్పీకి 160 నుంచి 165 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఎస్పీకి 1 నుంచి 5 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

    రిపబ్లిక్ అభిప్రాయ సేకరణలో- P MARQ, DB Live
    రిపబ్లిక్-పీ మార్క్, బీజేపీకి 252 నుంచి 272 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ సర్వేలో ఎస్పీకి 111 నుంచి 131 సీట్లు వస్తాయని తేలింది. అదే సమయంలో బీఎస్పీకి 8 నుంచి 16 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 9 సీట్లు రావచ్చు. డీబీ లైవ్ సర్వేలో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. డీబీ లైవ్ సర్వేలో ఎస్పీకి 203 నుంచి 211 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అదే సమయంలో బీజేపీ కేవలం 144 నుంచి 152 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. బీఎస్పీకి 12 నుంచి 20 సీట్లు, కాంగ్రెస్‌కు 19 నుంచి 27 సీట్లు వచ్చే అవకాశం ఉంది

    UP Elections 2022: అఖిలేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. బీజేపీలోకి ములాయం కోడలు ?

    Assembly Election 2022: వీడిన ఉత్కంఠ‌.. బీజేపీ కంచుకోట నుంచే యోగి ఆదిత్య‌నాథ్‌ పోటీ!

    టైమ్స్ నౌ, న్యూస్‌ఎక్స్, ఇండియా న్యూస్‌ల ఒపీనియన్ పోల్ ఫలితాలు
    టైమ్స్ నౌ-వీటో ప్రకారం బీజేపీకి 240 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎస్పీకి 143, బీఎస్పీకి 10, కాంగ్రెస్‌కు 8 సీట్లు వస్తాయని అంచనా. పోల్‌స్ట్రాట్-న్యూస్‌ఎక్స్ సర్వే ఫలితాల గురించి మాట్లాడితే.. బీజేపీకి 235 నుంచి 245 సీట్లు, ఎస్పీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని అంచనా. అదే సమయంలో బీఎస్పీకి 13 నుంచి 16 సీట్లు, కాంగ్రెస్‌కు 4 నుంచి 5 సీట్లు రావచ్చు. ఇది కాకుండా ఇండియా న్యూస్-జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ ఫలితాల్లో బీజేపీకి 226 నుంచి 246 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో ఎస్పీకి 144 నుంచి 160, బీఎస్పీకి 8 నుంచి 12, కాంగ్రెస్‌కు 0 నుంచి 1 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Uttar pradesh, Uttar Pradesh Assembly Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు