Home /News /national /

OPINION MINIMUM SUPPORT PRICE NOT THE PANACEA FOR ALL FARMERS WOES NK

OPINION: మద్దతు ధర కల్పిస్తే రైతుల కష్టాలు తీరిపోతాయా? అదే సరైన పరిష్కారమా?

OPINION: మద్దతు ధర కల్పిస్తే రైతుల కష్టాలు తీరిపోతాయా? అదే సరైన పరిష్కారమా? (image credit - twitter - ANI)

OPINION: మద్దతు ధర కల్పిస్తే రైతుల కష్టాలు తీరిపోతాయా? అదే సరైన పరిష్కారమా? (image credit - twitter - ANI)

Agriculture Reform Laws: ఇప్పుడు కేంద్రం ఏమంటోందంటే... పంటకు అయిన ఖర్చు కంటే... మద్దతు ధర 1.5 రెట్లు ఎక్కువే ఉంటోందని చెబుతోంది. కనీస మద్దతు ధరను ఎత్తేస్తున్నారనే ప్రచారం సరైనది కాదు.

  ఎముకలు కొరికే చలిలోనూ ఢిల్లీ రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. తాము తెచ్చిన మూడు కొత్త చట్టాల వల్ల రైతులు పండించిన పంటలకు ఇదివరకటి కంటే ఎక్కువ ధర లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే... కొన్ని రైతు సంఘాలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి. ఇక అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్... పాయింట్ 11 లోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ చట్టం (APMC), పాయింట్ 21 లోని నిత్యవసర సరుకుల చట్టం 1955ని రద్దు చేస్తామని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలోని ఏడో చాప్టర్‌లో ఈ విషయాల్ని కవర్ చేసింది. ఐతే... ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. పంజాబ్‌లోని రైతు సంఘాలు... ఢిల్లీ ధర్నాల్లో ఎక్కువగా పాల్గొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్... గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (GSVA)... 2020 జులై 31 ప్రకారం... పంజాబ్ GSVA... పంటల నుంచి రూ.76,504 ఉండగా... వ్యవసాయం, అడవులు, చేపల GSVA 2019 మార్చి 31 నాటికి రూ.1,34,594గా ఉంది. ఇదే కాలంలో వ్యవసాయ రుణాలు రూ.66,766 కోట్లు ఉన్నాయి. రుణాలు ఇంతలా ఉన్నాయంటే దాని అర్థం... వ్యవసాయ రంగంలో ఉత్పత్తులకు సరైన ధర ఇవ్వట్లేదనుకోవచ్చు లేదంటే... వ్యవసాయ రుణాలను భూస్వాములు ఇతర అవసరాలకు వాడేస్తున్నారనుకోవచ్చు.

  కొన్నాళ్ల కిందట రిజర్వ్ బ్యాంక్ (RBI) ఓ విషయం చెప్పింది. రైతుల సంఖ్య కంటే... వ్యవసాయ రుణాల అకౌంట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని తెలిపింది. అంటే వ్యవసాయ రుణాలు తప్పుదారి పడుతున్నట్లే. ప్రపంచంలో మరే రైతూ పండించలేనంత ఎక్కువ గోధుమలు లేదా వరిని ఒక ఎకరంలో పండించగలుగుతున్నారు పంజాబ్ రైతులు. ఐతే... తమ పేదరికానికి ప్రభుత్వమే కారణం అని వారు భావిస్తే... ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిందే. ఐతే... ఈ విషయంపై ఏదైనా తుది అభిప్రాయనికి వచ్చే ముందు అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

  తాజా ఆందోళనల్లో ప్రధాన మైన అంశం... కనీస మద్దతు ధర (MSP)కు చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వడం అన్నది. ఈ విషయాన్ని నేనూ ఒప్పుకుంటాను. ప్రబుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర కంటే తక్కువకు ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలూ కొనకూడదు అనే కండీషన్ ఒకటి ఉండి తీరాలి. ఇక్కడో విషయం మనం గ్రహించాలి. 2014తో పోల్చితే... NDA ప్రభుత్వం చాలా పంటల MSPని దాదాపు 50 శాతం పెంచింది. ఇప్పుడు కేంద్రం ఏమంటోందంటే... పంటకు అయిన ఖర్చు కంటే... మద్దతు ధర 1.5 రెట్లు ఎక్కువే ఉంటోందని చెబుతోంది. కనీస మద్దతు ధరను ఎత్తేస్తున్నారనే ప్రచారం సరైనది కాదు. ఎందుకంటే... ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కోసం ప్రభుత్వం కంటిన్యూగా ధాన్యాలు, పంటల దిగుబడిని సేకరిస్తూనే ఉంటుంది. తద్వారా ఆహార భద్రత కల్పిస్తుంది, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తుంది. రైతులకు స్వేచ్ఛ కల్పిస్తూ... తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చనే నిబంధనను తెస్తే... దాన్ని రైతు సంఘాలే వ్యతిరేకిస్తుండటం విచిత్రం.

  MSPకి చట్ట బద్ధత విషయానికి వస్తే... 2013 నాటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌లో ఇది ఉంది. సెక్షన్ 2 (10)లో దీన్ని నిర్వచించారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక అధికారులూ... ఈ చట్టం ప్రకారమే... ఆహార పదార్థాల్ని కొనాలి, పంపిణీ చేసుకోవాలి. మనం MSPని మించి ఇంకా పెద్ద విషయాల్ని పరిశీలిస్తే... MSP ఒక్కటే పరిష్కారం కాదు. మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని అమ్ముకునేవారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. 90 శాతం రైతులు చిన్న కమతాల్లోనే పంటలు పండిస్తున్నారు. తమకు అవసరమైనంత వరకే వారు పంటల్ని పండించగలుగుతున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే MSP వల్ల ప్రయోజనం పొందుతున్నారు. MSP ఒక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారం అని ఎవరైనా అంటే... వారు ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థం.

  MSP స్కీమ్ దశాబ్దాలుగా ఉంది. దాంతోపాటూ... తక్కువ వడ్డీకే రుణాలు, రుణాల ఎత్తివేత, టాక్స్ లేని ఆదాయం, విద్యుత్, ఎరువులు వంటి సబ్సిడీలు ఇవన్నీ రైతులకు ఇస్తున్నారు. రైతు కుటుంబాలు పెరుగుతున్న కొద్దీ... భూ పంపకాలు పెరిగి... చిన్న కమతాలే మిగులుతున్నాయి. దాంతో రైతులు వ్యవసాయం వదిలేసి ఇతర ఆదాయ మార్గాలు చూసుకుంటున్నారు. పశువుల పెంపకం, హార్టికల్చర్, ఫిషరీస్, పౌల్ట్రీ వంటి వాటినీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఆదాయం పెరిగేలా చేస్తోంది. మనందరం కలిసి... వ్యవసాయం నుంచి చాలా మందిని బయటకు తేవాల్సి ఉంటుంది. ఎందుకంటే... అక్కడ వ్యవసాయ నిరుద్యోగం ఉంది. చాలా మంది పని లేకపోయినా... వ్యవసాయంలోనే ఉండిపోతున్నారు.

  ఇండియా చాలా పెద్ద దేశం. అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన విధానం సెట్ కాదు. పంజాబ్ రైతుల సమస్యలు, బీహార్, యూపీ, ఏపీ రైతుల సమస్యలూ వేర్వేరు. ప్రతిపక్షాలు దేశవ్యాప్త ఉద్యమం చేయాలనుకుంటే... వారిని వారు తప్పు దారిలో నడుపుకుంటున్నట్లే. నేను కూడా ఓ రైతు కొడుకునే. కానీ నేను ఆందోళనకారులతో కలవట్లేదు.

  ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ధర్నా చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఐతే... అహింసను ఈ దేశ ప్రధాని సహించాల్సిన పని లేదు. అన్నదాతలైన రైతులకు మన సంస్కృతిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐతే... రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయ అజెండాను తెరపైకి తెస్తే... దాన్ని ఎవరూ అనుమతించరు.

  ఇది కూడా చదవండి:Zodiac Signs: ఈ రాశుల వారు సోషల్ మీడియాకు బానిసలు అయ్యే ప్రమాదం

  రచయిత ఓ చార్టెర్డ్ అకౌంటెంట్. ఈ అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: New Agriculture Acts

  తదుపరి వార్తలు