HOME »NEWS »NATIONAL »opinion farmers protests smells deeper conspiracy at play ak

Opinion: రైతు సంఘాల ఆందోళనల్లో కుట్ర కోణం

Opinion: రైతు సంఘాల ఆందోళనల్లో కుట్ర కోణం
రైతుల ఆందోళన

ఢిల్లీలో పలు రైతు సంఘాలు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనల వెనుక కుట్ర ఉన్నట్టు ప్రభుత్వం అనుమానిస్తోంది.

 • Share this:
  దేశంలోని అనేక రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ప్రశంసించాయి. ఈ చట్టాల ద్వారా రైతులు, వ్యాపారులకు మధ్య దళారులు లేకుండా పోతుందని.. దశాబ్దాల నుంచి రైతులు గురవుతున్న దోపిడీకి తెరపడటంతో పాటు రైతు ఆత్మహత్యలు కూడా ఆగతాయినే అభిప్రాయం వ్యక్తమైంది. కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా దేశంలోని వ్యవసాయ రంగంలో దశాబ్దాల నుంచి కోరుకుంటున్న అనేక మార్పులు రానున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి అడ్డుతగిలేందుకు చైనా సహా పలు దేశాలతో సంబంధాలు ఉన్న సంస్థలు పని చేస్తున్నాయి.

  సుదీర్ఘంగా కొనసాగుతున్న నిరసనల్లో ఆందోళనకారులకు వివిధ వర్గాల నుంచి సహాయం అందుతోంది. ఇది దేశీయ వ్యాపార సంస్థల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. ఈ రకమైన చర్యల వెనుక చైనా దేశ సంస్థల ప్రయోజనాలు మరియు ఈ ఆందోళనలు కొనసాగేలా ఆ దేశ నుంచి వనరులు వస్తున్నట్టు కనిపిస్తోంది. కరోనా సంక్షోభం తరువాత చైనా ఉత్పత్తులు ఇండియా, అమెరికా, కెనెడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల నియంత్రణ సంస్థలు భద్రతా పరమైన ఆంక్షలు పెడుతున్నాయి. చైనాకు చెందిన 5జీ ఉత్పత్తులతో పాటు ఇతర టెక్నాలజీకి వినియోగించే ఉత్పత్తులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.  ఈ విషయంలో మిగతా దేశాల కంటే భారత్ ముందువరుసలో నిలిచింది. చైనాకు చెందిన యాప్‌లు, పెట్టుబడులపై బ్యాన్ విధించడంతో ఆ దేశానికి చెందిన వ్యాపార, వాణిజ్య అంశాలపై ప్రభావం పడుతోంది. భారత్ బాటలో మరిన్ని ఇతర దేశాలు నడవడం డ్రాగన్ దేశానికి ఇబ్బందిగా మారింది. మన దేశంలో సంస్కరణలకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాలను వెనక్కి నెట్టడంతో పాటు సంస్కరణ మార్గం నుంచి దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో చైనా భాగస్వామ్యం కనిపిస్తోంది.

  మన దేశంలో జర్మనీ 5జీ టెక్నాలజీ వినియోగం కోసం తీసుకుంటున్న చర్యలు చైనాకు మింగుడుపడటం లేదు. ఇది చైనాకు ఇది చైనాకు భారీ ఆర్థిక మరియు భౌగోళిక-రాజకీయ చిక్కులను కలిగి ఉంది. ఇది టెలికాం తయారీదారులచే ఉపశమనం మరియు డ్రాగన్‌కు విధేయత కారణంగా ఎనేబుల్ చేసిన నిఘా నెట్‌వర్క్‌ల ద్వారా చైనా ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి రహస్య ప్రయోజనాలను కలిగి ఉంది. వీటిని తిరస్కరించడం ద్వారా ప్రత్యామ్నాయ విశ్వసనీయ భాగస్వామిగా సముచిత సాంకేతిక పరిజ్ఞానాలలో భారతీయ పలుకుబడి మరియు భారతదేశం యొక్క సాధ్యత గురించి ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చినట్టయ్యింది.

  5జి విషయంలో ఓ వర్గం చేస్తున్న ప్రచారం కూడా సరికాదు. భారతదేశంలో 5జి విప్లవాన్ని చెదరగొట్టాలనే నిర్దిష్ట లక్ష్యంతో చైనీయుల ఆదేశాల మేరకు భారత పరిశ్రమ ఖ్యాతిని కించపరిచేలా చేస్తున్న హానికరమైన ప్రచారం ఇది. రైతులను అడ్డం పెట్టుకుని కొందరు ఈ రకమైన ప్రచారం చేపట్టారు. దీని వెనుక దేశంలోని సామాజిక, ఆర్ధిక మరియు రాజకీయ అంశాలను బలహీనపరిచే కుట్ర కోణం కనిపిస్తోంది. తమ పాలనలో రైతులకు దశాబ్దాలుగా ఎలాంటి మేలు చేయని వాళ్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

  ముందుగా అనుకున్న ప్రకారంగానే ఈ ఆందోళనలు జరుగుతుండటం ఇందులో మరో కోణం. సాధారణంగా ఓ ఉద్యమానికి ప్రజల మద్దతు లభిస్తే.. ఆ తరువాత జనం వాళ్లంతట వాళ్లే ఇందుకు సహకరిస్తారు. అవినీతిపై అన్నా హజారే ఉద్యమంలో ఇది కనిపించింది. అయితే కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు సమగ్రమైన అవగాహన పెంచుకోవాలని అనేక మంది కోరుతున్నారు. ఆందోళన విషయంలో సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం, రైతులు ఇద్దరి మధ్య నమ్మకమైన వాతావరణం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.

  వ్యాసకర్త: నిషకాంత్ ఓజా, సలహాదారు, సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం (West Asia & Middle East)
  Published by:Kishore Akkaladevi
  First published:December 29, 2020, 20:12 IST

  टॉप स्टोरीज