Punjab: పంజాబ్‌లోని (Punjab) కనీసం 10 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ₹ 25 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తోందన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదుపై పంజాబ్ పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ చేస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని ఆప్ ఈ రోజు కోరింది. బీజేపీ కనీసం 10 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ₹ 25 కోట్లు ఆఫర్ చేసిందని అధికార పార్టీ పేర్కొంది. రాష్ట్ర బీజేపీ ఇప్పటికే ఆరోపణలను "నిరాధారం", "అబద్ధాల మూట" అని పేర్కొంది. ప్రస్తుతం దీనిపై పంజాబ్ లో తీవ్ర దుమారం చెలరేగింది.
ఇదిలా ఉండగా బీహార్ (Bihar) సీఎం నితీష్ కుమార్ (Nitish kumar) కొన్ని రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తు అనేక మంది కీలక నేతలను కలుసుకున్నారు.
వచ్చేసార్వత్రిక ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని అపోసిషన్ పార్టీలను ఏకం చేయడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో.. నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో (Prashanth kishore) భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జనతాదళ యునైటేడ్ కు చెందిన మాజీ నేత పవన్ వర్మ ఈ సమావేశం ఏర్పాడు చేసినట్లు తెలుస్తోంది. పవన్ వర్మ,ప్రశాంత్ కిషోర్ లు ఇద్దరూ రెండేళ్ల క్రితం నితీష్ కుమార్ తో విడిపోయారు.
ఈ క్రమంలో.. కొన్ని రోజుల క్రితమే.. పీకే.. నితీష్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ సైతం.. ప్రశాంత్ పైన తనదైన శైలీలో ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ విధంగా ఇద్దరి మధ్య మాటల్ వార్ జరిగిన కొద్ది రోజులకే వీరి మధ్య భేటీ ఆసక్తి కరంగా మారింది. ఈ క్రమంలో వీరు దాదాపు.. 45 నిముషాలపాటు సమావేశమైనట్లు సమాచారం. వీరి మీటింగ్ తర్వాత.. రిపోర్టర్లు నితీష్ కుమార్ ను పలు ప్రశ్నలు అడిగారు. దీనిపై నితీష్ కుమార్ సమాధానమిస్తూ.. ఇది కేవలం సాధారణ సమావేశమని, ఏలాంటి రాజకీయాలు చర్చలకు రాలేదని అన్నారు. అదే విధంగా.. పీకే చేసిన వ్యాఖ్యలతో తాను కలతచెందలేదని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhagwant Mann, Punjab, VIRAL NEWS