సంక్షోభంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం... కూలిపోతుందా?

Madhya Pradesh : అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంలో ప్రతిపక్షాలు ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయినట్లేనా? సీఎం కమల్‌నాథ్ కుర్చీ దిగిపోతారా?

news18-telugu
Updated: March 10, 2020, 6:28 AM IST
సంక్షోభంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం... కూలిపోతుందా?
కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా
  • Share this:
Madhya Pradesh Politics : ఓవైపు దేశమంతా కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటుంటే... ఉన్నట్టుండి... మధ్యప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే... అక్కడ దశాబ్దాల బీజేపీ సర్కార్‌ను గద్దె దింపి అధికారంలోకి వచ్చిన... సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం... 15 నెలల తర్వాత కుప్పకూలేలా ఉంది. సీఎం పదవిపై కన్నేసిన జ్యోతిరాదిత్య సింథియాను... బీజేపీ తమవైపు లాక్కుంది. నీకెందుకు నువ్వు పావులు కదుపు... మిగతాది మేం చూసుకుంటాం అంది. దాంతో జ్యోతిరాదిత్య తన పాచికలకు పదును పెట్టారు. మొత్తం 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. దాంతో వాళ్లంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వాళ్లలో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. షాకైన కమల్‌నాథ్ ఏం చెయ్యాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. రాత్రికి రాత్రి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి... తన కేబినెట్‌లో 28 మంది మంత్రులు ఉండగా... వారిలో ఆరుగురు సమావేశానికి రాలేదు. వారిలో ఐదుగురి మొబైల్స్ స్విచ్ఛాఫ్ అని వచ్చాయి. మరో మంత్రి ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు. కేబినెట్ భేటీకి 22 మంది మంత్రులే వచ్చారు. వాళ్లంతా సీఎంకి తమ రాజీనామా లేఖల్ని ఇచ్చారు. కమల్‌నాథ్ కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలని అనుకున్నారు. అందుకే వాళ్లతో రాజీనామా చేయించినట్లు తెలిసింది.

ఇక ప్రతిపక్ష బీజేపీ... జ్యోతిరాదిత్య సింథియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సీటును ఎరవేసినట్లు తెలిసింది. అలాగే కేంద్ర మంత్రి పదవి కూడా ఆశ చూపినట్లు సమాచారం. దీని వెనక బీజేపీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డా ఉన్నట్లు తెలిసింది. నడ్డా, అమిత్ షాలను గత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు. ఏం సార్ నాకు మళ్లీ సీఎం పీఠం ఇస్తారా అని అడిగినట్లు తెలిసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి ఉండే అవకాశాలపై వాళ్లు చర్చించుకున్నారు.

ఇక ఇవాళ సీఎం కమల్‌నాథ్... అత్యవసరంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి ఆ అజ్ఞాత పక్షులు వస్తాయా అన్నది డౌటే. బీజేపీ కూడా ఇవాళే శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేస్తోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ శాసన సభా పక్ష నేతగా మారేందుకు రెడీ అయ్యారు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇక చాప చుట్టుకోవాల్సిందే అనిపిస్తోంది.

230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఇక నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు BSP సభ్యులు, ఒక SP ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించడంతో.. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మెజార్టీ మార్కు 115 అనుకుంటే... కాంగ్రెస్ ప్రభుత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు... ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశాలు లేనట్లే అనుకుంటే... కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోతుంది. అదే సమయంలో... బీజేపీ 107 మందితోపాటూ... ఈ 17 మంది మద్దతూ పొందితే... ఈజీగా అధికారంలోకి రాగలదు. ఐతే... ఆ 17 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు అవుతుంది కాబట్టి... బీజేపీ... పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని... మొత్తంగా కాంగ్రెస్‌ను ముంచేసే వ్యూహంలో ఉందని తెలుస్తోంది. రెండు వారాల్లో మనకు పిక్చర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Published by: Krishna Kumar N
First published: March 10, 2020, 6:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading