హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mission Paani: కరోనాతో పాటు అంటు వ్యాధులకు ఇలా దూరంగా ఉందాం.. న్యూస్‌-18 ‘మిషన్ పానీ’లో మీరు కూడా భాగమవండి..

Mission Paani: కరోనాతో పాటు అంటు వ్యాధులకు ఇలా దూరంగా ఉందాం.. న్యూస్‌-18 ‘మిషన్ పానీ’లో మీరు కూడా భాగమవండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలోని ఏ దేశానికైనా అంటువ్యాధులు ఆ దేశ ప్రజల ఆరోగ్య భద్రతకు పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. కరోనా మిగిల్చిన కల్లోలం మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో పరిశుభ్రత ఎంత ముఖ్యమో అందరికీ తెలిసొచ్చింది.

  ప్రపంచంలోని ఏ దేశానికైనా అంటువ్యాధులు ఆ దేశ ప్రజల ఆరోగ్య భద్రతకు పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. కరోనా మిగిల్చిన కల్లోలం మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో పరిశుభ్రత ఎంత ముఖ్యమో అందరికీ తెలిసొచ్చింది. ఇప్పటికే త్రాగునీరు, శానిటైజేషన్, పరిశుభ్రత విషయంలో చాలామంది భారత్‌లో అవగాహన కలిగి ఉన్నప్పటికీ ఇప్పటికీ మన దేశ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు, పరిసరాల పరిశుభ్రత పెద్ద ఛాలెంజ్‌గా మారింది. దేశంలో పారిశుద్ధ్యం విషయంలో ఇప్పటికీ వెనుకబాటుతనం కనిపిస్తోంది.

  అపరిశుభ్ర వాతావరణం, పరిసరాలు అంటు వ్యాధులు ప్రబలేందుకు.. తద్వారా భయంకర వ్యాధులు ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపేందుకు కారణమవుతున్నాయి. ఈ విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది పబ్లిక్ టాయిలెట్స్ గురించి. ఇప్పటికీ దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన పెద్ద సమస్యగా మారింది. అడపాదడపా పబ్లిక్ టాయిలెట్స్ పురుషులకూ, మహిళలకూ ఉంటున్నప్పటికీ ఆ టాయిలెట్స్ అపరిశుభ్రంగా.. పబ్లిక్ టాయిలెట్స్‌కు వెళ్లాలంటేనే భయపడే విధంగా ఉంటున్నాయి. నిర్వహణ లోపం పబ్లిక్ టాయిలెట్స్‌కు అంత ఆదరణ దక్కకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పక తప్పదు. కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పరిసరాల పరిశుభ్రతకు కృషి చేస్తూనే ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ 1లో 100 శాతం గ్రామాల్లో పారిశుద్ధ్యం సక్రమంగానే అమలవుతోందని కేంద్రం ప్రకటించింది.

  కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 699 జిల్లాల్లోని 6 లక్షల గ్రామాలు అక్టోబర్ 2, 2019 నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో అక్టోబర్ 2019 నాటికి ఐదేళ్లలో 60 కోట్ల ప్రజల వినియోగానికి వీలుగా 11 కోట్ల టాయిలెట్లు నిర్మించడం జరిగింది. అయితే.. స్వచ్ఛ భారత్ మిషన్‌లో సాధించిన ప్రగతిని కాసేపు పక్కన పెడితే.. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5,2019-20) సమాచారం ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో 57 శాతం మంది ప్రజలకు మాత్రమే మరుగుదొడ్ల సదుపాయం ఉంది. కేవలం ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనే 100 శాతం టాయిలెట్ సదుపాయం ఉన్నట్లు NFHS డేటా స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ, నగర ప్రాంత ప్రజలందరూ స్వచ్ఛమైన పరిసరాల్లో నివసించేందుకు వీలుగా స్మార్ట్‌ టాయిలెట్స్‌కు (SMART Toilets) నడుం బిగించింది. టాయిలెట్ వినియోగం విషయంలో ఎదురవుతున్న సవాళ్లకు, నీటి వృధాకు చెక్ పెట్టే విధంగా అధునాతన టెక్నాలజీతో ఈ స్మార్ట్ టాయిలెట్స్ రూపొందించబడ్డాయి.

  ఇది కూడా చదవండి: Mission Paani: దేశంలోని నీటి కష్టాలకు సమిధలవుతున్న మహిళలు.. ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు?

  ఈ స్మార్ట్ టాయిలెట్స్ (SMART Toilets) వినియోగం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ఈ స్మార్ట్ టాయిలెట్స్ (SMART Toilets) కాన్సెప్ట్ ఒక గేమ్ ఛేంజర్ లాంటిది. టాయిలెట్స్ వినియోగిస్తున్న సందర్భంలో నీటి వృధాకు ఈ స్మార్ట్ టాయిలెట్స్ చెక్ పెట్టనున్నాయి. ఫ్లస్ చేసిన ప్రతిసారి సరిపడ నీటిని మాత్రమే వినియోగించే విధంగా ఈ స్మార్ట్ టాయిలెట్స్ రూపొందించబడ్డాయి. ఈ స్మార్ట్ టాయిలెట్స్‌లో స్నానాల గదుల్లో మహిళల కోసం శానిటరీ న్యాప్‌కిన్స్ మార్చుకునేందుకు వీలుగా వారి భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఈ స్మార్ట్ టాయిలెట్స్ (SMART Toilets) అందుబాటులోకి రానున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను, ప్రజారోగ్యాన్ని పెంపొందించే విధంగా ఈ స్మార్ట్ టాయిలెట్స్ రూపకల్పన జరిగింది. పైగా.. పబ్లిక్ టాయిలెట్స్‌తో పోల్చితే ఈ స్మార్ట్ టాయిలెట్స్ ఏర్పాటుకు, నిర్వహణకు ఖర్చు కూడా తక్కువే. మహారాష్ట్రకు చెందిన అర్‌వింద్ ధేతే అనే ఇంజనీర్ ఒకరు బయో టాయిలెట్‌ అభివృద్ధి చేశారు. ఆ బయో టాయిలెట్ ఖర్చు 6000 రూపాయలుగా ఆయన తెలిపారు.

  ఇది కూడా చదవండి: Mission Paani | భారతదేశంలో తాగునీరు ఎంతమందికి అందుబాటులో ఉందో తెలుసా..?

  ఇదే విధంగా.. గ్రామాలయ అనే ఎంజీవో రూ.18వేలతో స్మార్ట్ టాయిలెట్లను దేశంలోని పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 60వేలకు పైగా గ్రామాలయ ఈ స్మార్ట్ టాయిలెట్లను నిర్మించింది. అరవింద్ ధేతే గ్రూప్ అయిన ‘భారత్ ఏక్ కదమ్’ కూడా దేశవ్యాప్తంగా లక్ష బయోటాయిలెట్లను ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో భారత్‌లో ఈ స్మార్ట్ టాయిలెట్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్మార్ట్ టాయిలెట్ల ఏర్పాటుకు కార్పొరేట్ రంగానికి చెందిన కొన్ని సంస్థలు, స్టార్టప్స్ ముందుకు వస్తుండటం హర్షించదగ్గ పరిణామం. త్వరలో భారత్.. పారిశుద్ధ్యంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు లేకపోలేదు.

  న్యూస్ 18, హార్పిక్ ఇండియా చొరవతో ప్రారంభమైన మిషన్ పానీలో (Mission Paani) మీరు కూడా ఒక భాగమై భారతదేశంలో పరిశుభ్రత సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో పరిశుభ్రతను మెరుగుపరచడంలో సహాయపడొచ్చు. మీ కృషి చిన్నదైనా ప్రపంచంపై ప్రభావం పెద్దగా ఉంటుంది. ఇందుకు https://www.news18.com/mission-paani/ విజిట్ చేసి మిషన్ పానీ ఉద్యమంలో జాయిన్ అవ్వండి.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: India, Life Style, Mission paani, National News, News18

  ఉత్తమ కథలు