హిందువులు శాంతంగా ఉండాలి.. అయోధ్య తీర్పు నేపథ్యంలో ముస్లిం పెద్దల పిలుపు

దశాబ్దాల నాటి రామజన్మభూమి - బాబ్రీమసీదు వివాదంపై సుప్రీంకోర్టు మరికొన్ని గంటల్లో తీర్పు వెలువరించనుంది.

news18-telugu
Updated: November 8, 2019, 11:01 PM IST
హిందువులు శాంతంగా ఉండాలి.. అయోధ్య తీర్పు నేపథ్యంలో ముస్లిం పెద్దల పిలుపు
అయోధ్య వివాదంపై న్యూస్‌18 క్రియేటివ్
  • Share this:
దశాబ్దాల నాటి రామజన్మభూమి - బాబ్రీమసీదు వివాదంపై సుప్రీంకోర్టు మరికొన్ని గంటల్లో తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యూపీలో భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. రాజకీయ నాయకులు, మత గురువులు, మత పెద్దలకు, కొందరు ప్రముఖులు శాంతియుతంగా వ్యవహరించాలని అందరూ కోరుతున్నారు. అయితే, కొందరు మాత్రం ముస్లింల కంటే ఎక్కువగా హిందువులే ఎక్కువ శాంతియుతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రముఖ కవి మునవ్వర్ రాణా న్యూస్‌18తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశం ముందు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు. కొన్ని గంటల్లో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ముస్లింలు ఏం చేయాలని, ఏం చేయకూడదు అంటూ.. ముస్లిం మత పెద్దలు, మత గురువులు, రాజకీయ నాయకులు సూచనలు చేస్తున్నారు. కానీ, నా ఉద్దేశం ప్రకారం దేశంలో ముస్లింలను సంరక్షించాల్సింది హిందువులే.’ అని అన్నారు.

‘30 ఏళ్ల క్రితం నేను పాకిస్తాన్‌కు వెళ్లా. అప్పుడు అది మన శత్రుదేశం. ఇప్పుడు కూడా శత్రుదేశమే. అప్పుడు అక్కడి వారికి చెప్పా. 80 కోట్ల మంది హిందువులు ఉన్న దేశం ముస్లింలకు అత్యంత భరోసా కల్పిస్తోంది. ఈరోజు దేశంలోని హిందువులు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. సంయమనం అనేది కేవలం ముస్లింల బాధ్యత మాత్రమే కాదు.’ అని మునవ్వర్ రాణా అభిప్రాయపడ్డారు.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా వారు సంయమనంతో వ్యవహరించాలని షియా మతపెద్ద మౌలానా కాల్బే జావద్ అన్నారు. ‘అందరం సుప్రీంకోర్టు తీర్పుకోసం ఎదురుచూస్తున్నాం. న్యాయస్థానం ఏం తీర్పు చెప్పినా దాన్ని ముస్లింలు స్వాగతించారు. హిందువులు కూడా ఏ తీర్పు వచ్చినా స్వాగతించాలి. హిందూ సంఘాలు, ఆధ్యాత్మిక గురువులు కూడా శాంతియుతంగా ఉండాలని అందరికీ సూచించాలి.’ అని అన్నారు.

First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు