హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kerala High Court: హైకోర్టులో ఇంట్రెస్టింగ్ సీన్.. లాయర్‌పై జడ్జి ఫైర్.. ఆ దేవుడే కాపాడాలంటూ న్యాయమూర్తి ప్రార్థన.. ఇంతకీ ఆ కేసు ఏంటంటే..?

Kerala High Court: హైకోర్టులో ఇంట్రెస్టింగ్ సీన్.. లాయర్‌పై జడ్జి ఫైర్.. ఆ దేవుడే కాపాడాలంటూ న్యాయమూర్తి ప్రార్థన.. ఇంతకీ ఆ కేసు ఏంటంటే..?

కేరళ హైకోర్టు (పాత చిత్రం)

కేరళ హైకోర్టు (పాత చిత్రం)

న్యాయవాదులు తమ క్లయింట్‌ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాదించడం మానుకోవాలని సోమవారం సూచించింది. ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

న్యాయవాదులు తమ క్లయింట్‌ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాదించడం మానుకోవాలని సోమవారం సూచించింది. ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జిమ్ నిర్వహించడానికి సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ పి.వి.కున్హికృష్ణన్ విచారించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ రిసార్ట్ యాక్ట్, 1963 ప్రకారం రాష్ట్రంలో వ్యాయామశాలలు నిర్వహించడానికి చట్టం అమల్లో ఉన్నంత వరకు లైసెన్స్ తప్పనిసరి అని చెప్పారు. తన క్లయింట్ ప్రయోజనాలను జాగ్రత్తగా చూసుకోవడం, నిర్దిష్ట కేసు కచ్చితమైన చట్టాలు, నిబంధనలను, నివారణలు చెప్పడం న్యాయవాది విధిగా పేర్కొన్నారు. ఏ చర్యల ద్వారానూ క్లయింట్ ప్రయోజనాలను దెబ్బతీయకూడదని తెలిపారు. తన క్లయింట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాదిస్తున్నారని లాయర్‌ని పదే పదే కోర్టు హెచ్చరించినప్పటికీ, లాయర్ తన వాదనలను అదే విధంగా కొనసాగించారని చెప్పారు. దేవుడు మాత్రమే ఇలాంటి లాయర్లను రక్షించగలడని, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేస్తున్నానని జస్టిస్‌ కున్హికృష్ణన్‌ పేర్కొన్నారు.

కోర్టు రెండు పిటిషన్లపై తీర్పు చెప్పింది. ఒకటి సంబంధిత మునిసిపాలిటీ నుంచి లైసెన్స్ పొందకుండా పొరుగున ఫిట్‌నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారని మున్సిపాలిటీ తరఫున ఓ పిటిషన్‌ దాఖలైంది. మున్సిపాలిటీ లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించిందని ఆరోపిస్తూ మరొకరు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ తరుణంలో, కేరళ మున్సిపాలిటీ చట్టం, 1994 అమలులోకి వచ్చిన తర్వాత 1963 చట్టం వర్తించదని మున్సిపాలిటీ తరపు స్టాండింగ్ కౌన్సెల్ వాదనలు వినిపించింది. దీనిని 'వింత' వాదనగా న్యాయమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రం జారీ చేసిన ఆదేశాలకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం వ్యాయామశాలను నడపాలంటే లైసెన్సు తప్పనిసరి అని రాష్ట్రం నుంచి ఇటీవల వచ్చిన లేఖలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా, మున్సిపాలిటీ చట్టంలోని సెక్షన్ 58కి విరుద్ధం కావడమే కాకుండా, అతను తన క్లయింట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాదిస్తున్నట్లు తేలినందున, స్టాండింగ్ కౌన్సెల్ లేవనెత్తిన వాదనకు న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

 ఇదీ చదవండి: కొవ్వొత్తి, అగ్గిపెట్టె ఉందని కేసు..! కోర్టులో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘మొదట, మున్సిపాలిటీకి లేదా పిటిషనర్‌కు అలాంటి కేసు లేదు. అంతేకాకుండా, ప్రభుత్వం ఈ కోర్టు ముందు ఒక నివేదికను సమర్పించింది. వ్యాయామశాలను నిర్వహించడానికి, కేరళ పబ్లిక్ ప్లేసెస్ రిసార్ట్ చట్టం, 1963 ప్రకారం లైసెన్స్ అవసరమని పేర్కొంది. మున్సిపాలిటీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉంటుంది. కేరళ మునిసిపాలిటీ చట్టం 1994లోని సెక్షన్ 58, మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేసే ప్రభుత్వ అధికారానికి సంబంధించినది. నా అభిప్రాయం ప్రకారం, అటువంటి పరిస్థితులలో తన సొంత క్లయింట్ వాదనకు సపోర్ట్‌ చేయని మున్సిపాలిటీ తరపు న్యాయవాదిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు.’ అని చెప్పారు. స్టాండింగ్‌ న్యాయవాది వాదనను తోసిపుచ్చారు.

1963 చట్టం ప్రకారం లైసెన్స్ తప్పనిసరి అని పేర్కొన్న న్యాయమూర్తి, వ్యాయామశాలలు లైసెన్స్ పొందేందుకు తగిన 3 నెలల సమయం ఇవ్వాలని, లైసెన్స్ లేని కారణంగా వెంటనే వ్యాయామశాలలను మూసి వేయకూడదని స్పష్టం చేశారు. కేవలం అభ్యంతరం లేవనెత్తినందున, లైసెన్స్ కోసం దరఖాస్తు ఆటోమేటిక్‌గా తిరస్కరించకూడదని చెప్పారు.

అందువల్ల, చట్టం ప్రకారం లైసెన్స్ పొందకుండా ఏదైనా వ్యాయామశాలలు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు సాధారణ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రాన్ని కోర్టు కోరింది. మూడు నెలల్లోగా లైసెన్స్ పొందేందుకు ఆ వ్యాయామశాలలకు నోటీసు జారీ చేసింది.

Published by:Mahesh
First published:

Tags: High Court, Kerala

ఉత్తమ కథలు