ఇంటర్నెట్ ఓటింగ్ తెచ్చేదెప్పుడు... ఎంతసేపూ పాత పద్ధతేనా... మనోళ్లు మారరా...

Lok Sabha Elections 2019 : దేశవ్యాప్తంగా ఎన్నికలకు వేల కోట్లు ఖర్చవుతోంది. అదే ఆన్‌లైన్ ఓటింగ్ తెస్తే... ఖర్చు వందల కోట్లను దాటదు. నోట్ల రద్దు జరిగినప్పుడు... జస్ట్ నెలల్లోనే ప్రజలంతా... మొబైల్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ నేర్చుకున్నారు. అలాంటిది ఆన్‌లైన్ ఓటింగ్ ఎందుకు నేర్చుకోలేరో చెప్పాలి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 10, 2019, 9:11 AM IST
ఇంటర్నెట్ ఓటింగ్ తెచ్చేదెప్పుడు... ఎంతసేపూ పాత పద్ధతేనా... మనోళ్లు మారరా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టెక్నాలజీ ఉన్నది మనకోసమే. దాన్ని వాడేసుకోవాలి. ఒకప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో పేపర్ ఓట్లను వేసేవాళ్లు. ఆ మధ్య ఎలక్ట్రానిక్ ఓటంగ్ మిషన్లు (EVM)లు వచ్చాయి. వాటినీ అమల్లోకి తెచ్చారు. ఇప్పుడవి ఓల్డ్ అయిపోయినట్లే. ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంటే ఆన్‌లైన్ ఓటింగే. దీన్ని అమల్లోకి తెస్తే... అద్భుతాలు చెయ్యొచ్చు. 10 లక్షలకు పైగా పోలింగ్ బూతులు, లక్షల కొద్దీ పారామిలిటరీ బలగాలు, ఇన్ని వేల కోట్ల ఖర్చూ ఏమీ అవసరం ఉండవు. జస్ట్ ఎవరి మొబైళ్లలో వాళ్లు ఓటు వేసేస్తారు. తాము ఎవరికి ఓటు వేసింది స్లిప్ కూడా ప్రింట్ తీసుకుంటారు. ఎంతో ఈజీ... ఎంతో బెటర్ కూడా. ఇలా నెలల తరబడి ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సిన పని కూడా ఉండదు. జస్ట్... ఒకట్రెండు రోజుల్లో పనైపోతుంది. మావోయిస్టుల దాడుల టెన్షన్ కూడా ఉండదు.

హ్యాకర్లతో ప్రమాదమా : ఆన్‌లైన్ ఓటింగ్ అనగానే... పార్టీలు, నేతలు, అభ్యర్థులూ వ్యతిరేకించేవాళ్లే. దేశంలో వందల కొద్దీ బ్యాంకులున్నాయి. వాటి వెబ్‌సైట్లు నడవట్లేదా... హ్యాకర్లు దోచేస్తున్నారా? సైన్యానికీ, ప్రభుత్వాలకు సంబంధించిన సీక్రెట్ వెబ్‌సైట్లు ఉన్నాయి. వాటన్నింటినీ హ్యాకర్లు హ్యాక్ చేసేస్తున్నారా లేదు కదా. ఇదీ అంతే. ఆన్‌లైన్ ఓటింగ్ తెచ్చినప్పుడు దానికి తగ్గ విధంగా సెక్యూరిటీ ఫీచర్లు తీసుకొస్తే... హ్యాకింగ్ చెయ్యడం ఎవరి వల్లా కాదు. కావాలంటే... రెండు మూడు సర్వర్లలో డేటా స్టోర్ అయ్యేలా చేసుకోవచ్చు. ఒక సర్వర్ హ్యాక్ అయినా మిగతా సర్వర్లలో డేటా సురక్షితంగా ఉంటుంది. ఫలితంగా అన్నీ లాభాలే. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యే ఛాన్స్ లేదంటున్న ఈసీ... ఆన్‌లైన్ ఓటింగ్ హ్యాకింగ్ అవుతుందని ఎలా అభ్యంతరాలు చెప్పగలదు.

ఇప్పుడైతే ఎన్నికల నిర్వహణ కోసం లక్షల మంది సిబ్బంది అవసరమవుతున్నారు. పోలీసు బలగాల్ని వేర్వేరు రాష్ట్రాలకు తరలించాల్సి వస్తోంది. లక్షల కొద్దీ పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.50 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. అదే ఆన్‌లైన్‌లో పోలింగ్ తీసుకొస్తే... ఖర్చు రూ.500 కోట్లకు మించదన్నది టెక్నాలజీ నిపుణుల మాట. ఇన్నిన్ని కబుర్లు చెప్పే ప్రభుత్వాలు ఈ మార్పు మాత్రం తేవకపోవడం విచారకరమే. ఆ మిగిలిన డబ్బుతో దేశంలో పేదరికాన్ని తగ్గించవచ్చు. ఉచిత వైద్యం అందించవచ్చు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు.


అందరూ వెయ్యలేరా : ఆన్‌లైన్ ఓటింగ్ అయితే... అందరూ ఓటు వెయ్యలేరనీ, అందరికీ ఇంటర్నెట్‌పై అవగాహన లేదనీ రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ఇదీ నిజం కాదు. ఈ రోజుల్లో 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ స్మార్ట్ మొబైళ్లన ఆపరేట్ చెయ్యగలుగుతున్నారు. తమ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డుల్ని ప్రింట్ తీసుకోగలుగుతున్నారు. ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు చెయ్యగలుగుతున్నవారు... ఓ ఓటు వెయ్యలేరా... ఆ మాత్రం టెక్నాలజీ నేర్చుకోలేరా.నోట్ల రద్దు జరిగినప్పుడు... జస్ట్ నెలల్లోనే ప్రజలంతా... మొబైల్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ నేర్చుకున్నారు. అలాంటిది ఆన్‌లైన్ ఓటింగ్ ఎందుకు నేర్చుకోలేరో చెప్పాలి.

ప్రపంచంలో చాలా దేశాలు : బెల్జియం, బ్రెజిల్, మెక్సికో, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్పెయిన్, ఎస్తోనియా, ఫిలిప్పీన్స్, వెనిజులా, స్విట్జర్లాండ్, నార్వే, న్యూజిలాండ్, యూఏఈ, కెనాడాలో కొన్ని ప్రాంతాల్లో ఆన్ లైన్‌ ఓటింగ్ కొన్ని సందర్భాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియాలో మున్సిపల్ ఎన్నికలకు ఆన్ లైన్ ఓటింగ్ అమలు చేస్తారు. అమెరికాలో కొంతమంది వారం ముందుగా ఆన్‌ లైన్‌లో ఓటు వేస్తారు. మరి ఈ దేశాల్లో అమలవుతున్న ఆన్‌లైన్ ఓటింగ్ మన దేశంలో ఎందుకు అమలు చెయ్యలేం?

32 కోట్లమంది ఎన్నారైల సమస్య : మన దేశానికి చెందిన 32 కోట్ల మంది ఎన్నారైలు విదేశాల్లో ఉంటున్నారు. వారంతా ఆన్‌లైన్ ఓటింగ్ కోరుతున్నారు. పదేళ్ల కిందటే ఇలాంటిది తేవొచ్చని అప్పటి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా ప్రయత్నించలేదు. 2010లో గుజరాత్‌లో స్థానిక ఎన్నికల్లో ఇంటర్నెట్ ఓటింగ్ ప్రయోగాత్మంగా అమలు చేశారు. కానీ దాన్ని సరిగ్గా నిర్వహించకుండా పక్కన పెట్టారు. ఇక్కడ తప్పు అధికారులదే ఉంది తప్ప... హ్యాకర్లేమీ చెయ్యలేదు.మార్పు తేవాలంటే తేగలరు. నిజంగా డబ్బు ఆదా చెయ్యాలనే ఆలోచనే ఉంటే... ఇంత మంచి ఆప్షన్‌ను అమల్లోకి తేవచ్చు. ప్రభుత్వాలు తలచుకుంటే అది సాధ్యమే.

 

ఇవి కూడా చదవండి :

ఓటుకు రూ.500 నుంచీ రూ.5000... ఎక్కడిదీ డబ్బు... మనదే కదా...

ఆ థాయ్‌ల్యాండ్ బీచ్‌లో ఫొటోలు తీసుకుంటే... ఉరి తీస్తారు... ఎందుకో తెలుసా...


రేపు 91 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవీ ప్రత్యేకతలు

ఒక్కొక్కరికీ రెండేసి ఓటరు కార్డులు... ఆ ఓట్లు చెల్లుతాయా... ఈసీ ఏం చేయబోతోంది

ఓట్ల పండుగకు క్యూ కట్టిన ఓటర్లు.. ఏపీకి వెళ్లే రైళ్లు ఫుల్

First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు