Home /News /national /

ONLINE FRAUD IN THE NAME OF CASHEW ALMONDS WITH ATTRACTIVE ADS SU

Cashews And Almonds: సగం ధరకే జీడిపప్పు, బాదం.. మీరు కొనాలని చూస్తున్నారా?.. అయితే ఈ విషయం కూడా తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా జనాల ఆహారపు అలవాట్లలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా బలవర్ధకమైన, ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

    కరోనా కారణంగా జనాల ఆహారపు అలవాట్లలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా బలవర్ధకమైన, ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాదం, జీడిపప్పు, పిస్తా.. రోగ నిరోధక శక్తిని పెంచే వాటిని తీసుకుంటున్నారు. దీంతో మార్కెట్‌లో బాదం, జీడిపప్పుడు వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే దీనిని అసరగా చేసుకున్న కొందరు వ్యక్తులు.. బాదం, జీడిపప్పును సగం ధరకే అందజేస్తామని ఆఫర్ చేస్తున్నారు. జీడిపప్పు కిలో రూ. 500కు, బాదం కిలో రూ. 300కే ఇస్తామని.. అడ్రస్ చెబితే రెండు గంటల్లోనే హోం డెలివరీ చేస్తామని ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటనలు ఇస్తున్నారు. అయితే ఇదంతా నిజమని నమ్మి.. మీరు బాదం, జీడిపప్పు కొనుగోలు చేయాలని చూస్తే.. మీరు సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడిపోయినట్టే.

    జీడిపప్పు, బాదం, ఖర్జూరం, అవిసెగింజలు, తృణ ధాన్యాలను జనాలు ఆకట్టుకునే కవర్లపై ముద్రించి 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని, ఆర్డర్‌ చేసిన మొత్తంలో 50శాతం ముందుగానే చెల్లిస్తే రెండు గంటల్లో హోమ్‌ డెలివరి చేస్తామని సైబర్ నేరగాళ్లు ప్రకటనలో పేర్కొంటున్నారు. ఆర్డర్ చేయాలంటే కనీసం రెండు వేల రూపాయలు మొత్తం ఉండాలని చెబుతున్నారు. అయితే ఈ ప్రకటనలు చూసి వందల మంది డ్రై ఫ్రూట్స్ కావాలంటూ వారు చెప్పిన నెంబర్లను ఫోన్ చేస్తున్నారు. జనాలు వారు చెప్పిన ఖాతాల్లోకి డబ్బులు జమ చేయగానే.. అవతలి వ్యక్తులు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.

    ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి వచ్చింది. భరత్‌పూర్ సైబర్ నేరస్థులే ఈ మోసాలు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్‌బుక్‌, ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ప్రకటనలు పోస్ట్‌ చేస్తున్నవారిలో 95శాతం వీరే ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్లకు ధీటుగా.. మెల్టింగ్‌ హార్ట్స్‌ పేరుతో విభిన్నమైన ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో కూడా ఇంటికే మద్యం పంపిణీ చేస్తామంటూ.. ప్రముఖ మద్యం దుకాణాల పేర్లతో ఫేస్‌బుక్ ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ జనాలకు సూచిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: CYBER CRIME, Online fraud

    తదుపరి వార్తలు