లాక్‌డౌన్-4లో రైల్వేశాఖకు మరిన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. హోంశాఖ, వైద్యఆరోగ్యశాఖ సూచనలతో జూన్ 1 నుంచి 200 రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. మొత్తం 200 రైళ్లకు (100 జతలు) సంబంధించిన వివరాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఈ నెల 21 (గురువారం) ఉదయం 10 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లన్నింటినీ ప్రత్యేక రైళ్లగానే పరిగణిస్తారు. ఈ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ బోగీలు కూడా ఉంటాయి. ఐతే జనరల్ బోగీలకు కూడా టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కోచ్‌లోనూ సెకండ్ సీటింగ్ (2s) చార్జీలను వసూలు చేస్తారు. ఈ రైళ్ల బుకింగ్స్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ కూడా ఉటుంది. ఐతే వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలిగిన వారిని రైళ్లలోకి అనుమతించరు.
జూన్ 1 నుంచి నడిచే రైళ్ల వివరాలు:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Irctc, Lockdown, Special Trains