నవంబర్ వరకు ఉల్లి ధరలు తగ్గవు.. ఎందుకంటే..

ఉల్లి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రలో పండుతోంది. ఇటీవల వర్షాలతో అక్కడ పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు వ్యాపారులు కూడా ఇదే సమయం చూసుకుని సరుకుని దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

news18-telugu
Updated: September 28, 2019, 2:06 PM IST
నవంబర్ వరకు ఉల్లి ధరలు తగ్గవు.. ఎందుకంటే..
ఉల్లి ధరల ఘాటుపై న్యూస్‌18 క్రియేటివ్
news18-telugu
Updated: September 28, 2019, 2:06 PM IST
ఉల్లి ధరల ఘాటు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. కొన్నిచోట్ల కేజీ రూ.70 నుంచి రూ.80 వరకు కూడా పలుకుతోంది. ఇవాళ ఉన్న ధర రేపటికి మారిపోతోంది. దీంతో జనం కూడా బెంబేలెత్తుతున్నారు. ఈ ఉల్లి కొనడం కంటే మానడం మంచిదనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. దీంతోపాటు అసలు ఈ ఉల్లి ధరలు ఎప్పటికి తగ్గుతాయనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అయితే, ఉల్లి ధరలు ఎప్పుడు దిగొస్తాయో నీతి ఆయోగ్ సభ్యుడు తెలిపారు. ఉల్లిపాయ ధరలు నవంబర్ నుంచి తగ్గుముఖం పడతాయని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ తెలిపారు. నవంబర్ నాటికి దాదాపు దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంట చేతికి వస్తుంది కాబట్టి, అప్పటికి ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. ఉల్లి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రలో పండుతోంది. ఇటీవల వర్షాలతో అక్కడ పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు వ్యాపారులు కూడా ఇదే సమయం చూసుకుని సరుకుని దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రేట్లు పెరిగేందుకు పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, డిమాండ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కేంద్రం నుంచి నామమాత్రకు ధరకు కొనుగోలు చేసి ప్రజలకు అందించవచ్చంటూ ఇప్పటికే మంత్రులు ప్రకటనలు చేశారు.

First published: September 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...