ఉల్లి వ్యాపారులకు కేంద్రం షాక్... కొనుగోలుదారులకు ఊరట

Onion Prices | ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: September 29, 2019, 2:34 PM IST
ఉల్లి వ్యాపారులకు కేంద్రం షాక్... కొనుగోలుదారులకు ఊరట
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 29, 2019, 2:34 PM IST
ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేజీ రూ.70 నుంచి రూ.80 వరకు ధర పలుకుతోంది. అయితే, ఆ ధరలు ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలీదు. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొనుగోలుదారులకు ఊరట కల్పించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో కేజీ రూ.25కే అందిస్తున్నారు. పంజాబ్‌లో కూడా కేజీ ఉల్లి రూ.35కి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రెండు కేజీల చొప్పున ఉల్లి అందిస్తున్నారు.

ఉల్లిపాయ ధరలు నవంబర్ నుంచి తగ్గుముఖం పడతాయని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ తెలిపారు. నవంబర్ నాటికి దాదాపు దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంట చేతికి వస్తుంది కాబట్టి, అప్పటికి ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. ఉల్లి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రలో పండుతోంది. ఇటీవల వర్షాలతో అక్కడ పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు వ్యాపారులు కూడా ఇదే సమయం చూసుకుని సరుకుని దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రేట్లు పెరిగేందుకు పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, డిమాండ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కేంద్రం నుంచి నామమాత్రకు ధరకు కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాయి.

 

First published: September 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...