జమిలి ఎన్నికలు సరైన నిర్ణయమేనా?... పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఖర్చు సంగతేంటి?

One Nation, One Election : జమిలి ఎన్నికలపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. బుధవారం వివిధ పార్టీల అధినేతలతో సమావేశమైన ప్రధాని మోదీ... జమిలి ఎన్నికలు సాధ్యమయ్యే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 23, 2019, 1:57 PM IST
జమిలి ఎన్నికలు సరైన నిర్ణయమేనా?... పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఖర్చు సంగతేంటి?
జమిలి ఎన్నికలు అవసరమేనా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే పార్టీలు జమిలి ఎన్నికల్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ పార్టీలు ప్రధానితో సమావేశానికి హాజరు కాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ, టీఆర్ఎస్ తమ ప్రతినిధులను సమావేశానికి పంపాయి. ఆ మీటింగ్ తర్వాత... జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఓ కమిటీ వేస్తున్నట్లు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. నిజానికి జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. 1967 వరకూ ఎన్నికలు అలాగే జరిగేవి. 1951-52, 1957, 1962, 1967లో లోక్‌సభ ఎన్నికలతోపాటే... రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2016 మార్చిలో ప్రధాని మోదీ... జమిలి ఎన్నికల ప్రస్థావన తెచ్చారు. 2017లో నీతి ఆయోగ్... ఇందుకు సంబంధించి ఓ నివేదిక ఇచ్చింది. 2018లో కొన్ని అభ్యంతరాలతో లా కమిషన్ తన నివేదిక సమర్పించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ అల్లుకుపోతోంది. ఇలాంటి సమయంలో... వన్ నేషన్, వన్ ఎలక్షన్ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించడం సరైన నిర్ణయంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

నిజానికి జమిలి ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేవని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిణామాల్ని చూస్తే, జమిలి ఎన్నికల వల్ల లాభపడేది బీజేపీయేననీ, ప్రాంతీయపార్టీలకు అది సమస్యలు కలిగిస్తుందని అంటున్నారు.

బీజేపీ వాదన ఏంటి : 2019 లోక్ సభ ఎన్నికలకు రూ.60 వేల కోట్లు ఖర్చు అయ్యాయని తెలుస్తోంది. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ఖర్చులు, వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఖర్చులూ ఉన్నాయి. ఐతే... 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అయిన ఖర్చు రూ.45 వేల కోట్లు ఖర్చైంది. ఎన్నికల కమిషన్ ప్రకారం... 2019 ఎన్నికల్లో వేల కోట్ల అక్రమ డబ్బును ఈసీ సీజ్ చేసింది. జమిలి ఎన్నికల కంటే ముందు... ఎన్నికల ఖర్చులు, రాజకీయ పార్టీలు, నేతలు చేస్తున్న ఖర్చులపై పారదర్శక విధానం తేవాలన్న డిమాండ్లు ఉన్నాయి.

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ డేటా 2017-18 ప్రకారం... 53 శాతం రాజకీయ పార్టీల ఆదాయం ఎక్కడి నుంచీ వస్తుందన్నది తేలట్లేదు. 36 శాతానికి సంబంధించిన లెక్కలు మాత్రమే బయటకు వస్తున్నాయి. 11 శాతం రెవెన్యూ... సభ్యత్వ రుసుములు, ఆస్తుల అమ్మకాల ద్వారా వస్తున్నాయి.

భారత చట్టాల ప్రకారం... రూ.20వేల కంటే తక్కువ విరాళం ఇచ్చేవారి పేర్లను పార్టీలు వెల్లడించాల్సిన పనిలేదు. 2017 బడ్జెట్‌లో తెచ్చిన ఎలక్టొరల్ బాండ్స్ స్కీం వల్ల... ఎక్కడ లేని డొనేషన్లు వచ్చి పడ్డాయి. వాటిలో చాలా వరకూ ఎవరు ఇచ్చారో తేలనివే. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా... రాజకీయ నిధులపై స్పష్టత తెచ్చేందుకు ప్రయత్నించట్లేదు. కారణం ఆ నిధుల వల్ల ప్రయోజనం పొందుతున్నవి ఆ పార్టీలే కాబట్టి.

ఈసీ ప్రకారం... లోక్ సభ ఎన్నికలకు ఓ అభ్యర్థి రూ.70లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చెయ్యాలి. వాస్తవం అలాగే ఉందా అన్న ప్రశ్నకు ఆన్సర్ అందరికీ తెలిసిందే. ఇటీవల గురుదాస్ పూర్ నుంచీ పోటీ చేసిన బీజేపీ ఎంపీ సన్నీడియోల్ రూ.86 లక్షలు ఖర్చు పెట్టారని ఈసీ సీరియస్ అయ్యింది. ఇలా స్పందించిన ఘటన అరుదైనదనే చెప్పుకోవాలి.

లోక్‌సభ ఎన్నికల్లో నిరుద్యోగం, దేశ భద్రత అంశాలు కీలకంగా ఉంటాయి. అదే అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతలు, విద్య, ఎలక్ట్రిసిటీ, నీటి పారుదల, ఆరోగ్యం వంటివి ప్రాధాన్య అంశాలుగా ఉంటాయి. జమిలి ఎన్నికలు జరిగితే... ఓటర్లు జాతీయ అంశాలకే ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా స్థానిక అంశాలు మరుగున పడిపోతాయి. ఇది ఓటర్ ఏ మాత్రం ఆశించని పరిణామం. నిజానికి జమిలి ఎన్నికలు ఓటర్ల కన్‌ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదీ కాక, క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదమూ ఉంది. అందువల్ల లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించడం సరైన నిర్ణయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖర్చును తగ్గించే ఉద్దేశమే కీలకమైతే... మరింత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే... ఆటోమేటిక్‌గా ఖర్చును తగ్గించే అవకాశం ఉంటుందంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Pics : మెరుస్తున్న ఖతార్... అరబ్ దేశాలు బాయ్‌కాట్ చేసినా... అదే పట్టుదల...


రైల్వే టికెట్లపై సబ్సిడీని ఎత్తేస్తారా... రైల్వేలో ఏం జరుగుతోంది?

పేగుల్లో కాన్సర్‌ను కనిపెట్టే మినీ రోబో... లండన్ సైంటిస్టుల సృష్టి...
Published by: Krishna Kumar N
First published: June 23, 2019, 1:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading