Delhi : మరోవారం లాక్డౌన్ పొడగింపు ,31 తర్వాత సడలింపులు ఉంటాయన్న సీఎం కేజ్రీవాల్

మరోవారం లాక్డౌన్ పొడగింపు ,31 తర్వాత సడలింపులు ఉంటాయన్న సీఎం కేజ్రీవాల్

Delhi lockdown : ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా పాజిటివిటి రేటు తక్కువ అయినప్పటికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా ప్రస్తుత లాక్‌డౌన్ మే 31వరకు కొనసాగనుంది.

  • Share this:
ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడగించారు. సోమవారంతో లాక్‌డౌన్ ముగియనుండడంతో నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి వారం రోజుల పాటు లాక్‌‌డౌన్ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈసారీ తీసుకున్న లాక్డౌన్‌ నిర్ణయం ముందుజాగ్రత్త కోసమని సీఎం కేజ్రీవాల్ తెలిపారు..రాష్ట్రం మొత్తం మీద పాజిటివిటి రేటు 2.5 మాత్రమే ఉందని చెప్పారు..ఈ నేపథ్యంలోనే మే 31 తర్వాత లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం లాక్డౌన్ వల్ల వైరస్ ఉదృతి తగ్గడం స్పష్టం కనిపిస్తోందని, దీంతో వైరస్‌పై విజయం సాధించినట్టు కాదని తెలిపారు..కాకపోతే వైరస్ వ్యాప్తిని మాత్రం తగ్గించామని తెలిపారు..ఈ నేపథ్యంలోనే 35 శాతం పాజిటివిటీ రేటు నుండి 2.5 శాతానికి తగ్గిందని చెప్పారు.

అయితే సెకండ్ వేవ్  ఎంతకాలం ఉంటుందో స్పష్టంగా చెప్పలేమని అన్నారు. ఇక మూడో వేవ్ వరకు అందరికి వ్యాక్సిన్లు వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని చెప్పారు..మూడు నెలల్లో అందరికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నా..వ్యాక్సిన్ కొరత పట్టి పీడిస్తుందని చెప్పారు. అయినా ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాక్సినేషన్ చేస్తామని చెప్పారు.

కరోనా సెకండ్‌వేవ్‌తో గత కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఓ వైపు ఆక్సిజన్ కొరత మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతతో కొద్ది రోజుల పాటు నరకం చూశారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు. ముందుగా వారాంతపు లాక్డ్‌న్ ప్రకటించిన కేజ్రీవాల్ ఏప్రిల్ 19 నుండి పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం విధించిన లాక్డౌన్ మే 31వరకు కొనసాగనుంది.
Published by:yveerash yveerash
First published: