డైమండ్ సిటీలో మృత్యుఘోష.. మరో కార్మికుడు ఆత్మహత్య

వజ్రాల కాంతుల్లో వెలిగిపోయిన సూరత్ డైమండ్ ఇండస్ట్రీ.. ఇప్పుడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉపాధి లేక.. ఆర్థిక సమస్యలతో.. వజ్రాల కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: July 8, 2020, 12:39 PM IST
డైమండ్ సిటీలో మృత్యుఘోష.. మరో కార్మికుడు ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(కీర్తేశ్ పటేల్, న్యూస్ 18 సూరత్ ప్రతినిధి)
కరోనాతో యావత్ ప్రపంచం తలకిందులయింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయింది. కరోనా తెచ్చిన కష్టాలతో కంపెనీలు నష్టాల బాటపట్టాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో కంపెనీలు తెరచుకోలేదు. ఉత్పత్తులకు మార్కెట్‌లో గిరాకీ లేక మూతపడిపోతున్నాయి. ఇండియన్ డైమండ్ సిటీ సూరత్‌లోనూ ఇదే పరిస్థితి. వజ్రాల కాంతుల్లో వెలిగిపోయిన సూరత్ డైమండ్ ఇండస్ట్రీ.. ఇప్పుడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉపాధి లేక.. ఆర్థిక సమస్యలతో.. వజ్రాల కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

సూరత్‌లో తాజాగా మరో వజ్రాల కార్మికుడు ప్రాణాలు తీసుకున్నాడు. సురేంద్రనగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ భగ్‌వాన్ భాయ్ సోలంకి సూరత్‌ హిరాబాగ్‌లోని భక్తి నగర్‌లో ఫ్యామిలీతో నివసిస్తున్నాడు. ఓ వజ్రాల కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మార్చి వరకు ఈయన జీవితం సాఫీగా సాగిపోయింది. కానీ దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడం, లాక్‌డౌన్ ప్రకటించడంతో ఒక్కసారిగా కష్టాలు మొదలయ్యాయి. సూరత్‌లో డైమండ్ పరిశ్రమలన్నీ మూతపడడంతో ఉపాధి కరువయింది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే మంగళవారం తన ఇంట్లో ఉరేసుకొని లక్ష్మణ్ భగ్‌వాన్ ఆత్మహత్య చేసుకున్నాడు.

వజ్రాల కార్మికుడు లక్ష్మణ్ భాయ్


కుటుంబ సభ్యుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ వల్ల జాబ్ పోయిందని.. ప్రస్తుతం పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. అందుకే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సూసైడ్ నోట్‌లో రాశారు. లక్ష్మణ్ భాయ్‌కి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సూరత్‌లో ఇప్పటికే పలువురు వజ్రాల కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 8, 2020, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading