బెంగళూరులో తీవ్ర కలకలం రేగింది. రాజరాజేశ్వరినగర్ ఎమ్మెల్యే మునిరత్న ఇంటి సమీపంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మృతుడిని స్థానికంగా బట్టలు ఉతికే వెంకటేశ్‌గా గుర్తించారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు తీభ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
ఉదయం 09.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడుతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సిటీ కమిషనర్ సునీల్ కుమార్ పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఐతే బ్లాస్ట్ ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.