Asteroid: రేపు భూమికి అతి చేరువలో రానున్న గ్రహశకలం!

ప్రతికాత్మక చిత్రం

(రేపు) సెప్టెంబర్‌ 22 రాత్రి ఒక ఉల్క మన భూమికి దగ్గర రానున్నది. ఈ గ్రహ శకలం పేరు 2021 NY–1 గా నామకరణం చేశారు. అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా NASA దీన్ని భూమికి పొంచివున్న గ్రహ శకలాల ముప్పు జాబితాలో చేర్చింది.

  • Share this:
మన గెలాక్సీ Galaxy లో అనేక రకాల గ్రహశకలాలు Asteroids వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి పాలపుంతలో నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. అయితే, ఇక్కడి వరకు ఫర్వాలేదు కానీ, ఈ శకలాలతో భూమికి చేరువలో వస్తే... వాటితో ఏదైనా ప్రమాదం ఉందంటేనే భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే వీటితో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే.. పూర్తి మానవాళి మనుగడకే ప్రమాదం. అయితే, ఇలాంటి శకలాలు గతంలో భూమికి చేరువలో వచ్చాయి. వాటితో ఇప్పటి వరకు ఏ ప్రమాదం జరగలేదు. ఇప్పుడు మరో గ్రహ శకలం భూమికి అతి చేరువలో రాబోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. రేపు (బుధవారం) సెప్టెంబర్‌ 22 రాత్రి పగలు.. రాత్రి సమానంగా ఉండనుంది. ఇది ఓ అద్భుతం. కానీ, ఒక ఉల్క మన భూమికి దగ్గర రానున్నది కూడా రేపే. దీని పొడవు ప్యారిస్‌ ఈఫిల్‌ టవర్‌ Eiffel tower కంటే మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ. ఈ గ్రహ శకలం పేరు 2021 NY–1 గా నామకరణం చేశారు. అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా NASA దీన్ని భూమికి పొంచివున్న గ్రహ శకలాల ముప్పు జాబితాలో చేర్చింది. ఇది కాస్త ఆందోళనకలిగించే విషయమే.

భూమి– గ్రహశకలం దూరం..
భూమికి ముప్పు కలిగించే ఆస్టరాయిడ్‌ కేటగరీలో ఉన్న శకలాలపై ప్రత్యేక నిఘా ఉంచారు శాస్త్రవేత్తలు. ఈ గ్రహ శకలం భూమి నుంచి దాదాపు 14 లక్షల కీ.మీ దూరం గుండా వెళ్తుందని చెబుతున్నారు. సాధారణంగా ఈ స్పీడ్‌ను చాలా చిన్నదిగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ గ్రహ శకలంతో ఎటువంటి ముప్పు లేదని అంటున్నారు. భూ కక్ష్యలోకి చేరుకున్న వెంటనే గ్రహ శకలం వేగం 9–1000 కీలో మీటర్ల వేగం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడు భూమి నుంచి ఈ గ్రహ శకలం దూరం మరింత తగ్గుతుంది.

దూసుకొస్తున్న సౌర తుఫాను... మీ ఫోన్లలో ఛార్జింగ్ ఫుల్లుగా ఉందా?


షైనింగ్‌ ఆస్టరాయిడ్‌..
ఈ గ్రహ శకలం భూమివైపుగా వస్తున్నపుడు చాలా ప్రకాశవంతంగా ఉంటుందని నైనితల్‌లోని ఆర్యభట్ట అబ్జర్వేషన్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ పబ్లిక్‌ ప్రోగ్రాం ఇన్‌ఛార్జ్‌ డా. వీరేంద్ర యాదవ్‌ చెప్పారు. అంతేకాదు, ఈ ఆస్టరాయిడ్‌ భూ కక్ష్యలోకి చేరిన వెంటనే దాని వేగం మరింత పెరుగుతుందని అంటున్నారు. చాలా ఏళ్ల నుంచి ఈ ఆస్టరాయిడ్స్‌పై శాస్త్రవేత్తలు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే, ఖగోళ శాస్త్రవేత్తలకు సెప్టెంబర్‌ 22 రాత్రి చారిత్రాత్మక సమయం కానుంది.

భూమికి ప్రమాదకరమైన 22 ఆస్టరాయిడ్స్‌..
అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా 22 గ్రహశకలాలను భూమికి అత్యంత ప్రమాదకరమైన జాబితాలో చేర్చింది. ఇవి భూమిని ఢీకొడితే ఒక పెద్ద విపత్తును సృష్టించే సామర్థ్యం కలవని శాస్త్రవేత్తల నమ్మకం. ఈ నెలలో భూమికి అతి చేరువలో వెళ్తున్న రెండో గ్రహశకలం ఇదే. భూమి నుంచి 46.5 లక్షల మైళ్ల కంటే ఎక్కువ స్పీడ్‌గా లేదా ఏ ఇతర శకలాలు భూమికి చేరువలోకి వస్తే ప్రమాదకరమైన కేటగిరీలో ఉంచుతారు. నాసా అటువంటి గ్రహశకలాలను పర్యవేక్షిస్తుంది.
Published by:Renuka Godugu
First published: