మళ్లీ పాడిన రణు మండల్... లతామంగేష్కర్ పాటకు నెటిజన్లు ఫిదా...

Ranu Mondal Songs : ఇంటర్నెట్ సెన్సేషన్ రాణు మండల్... మరోసారి తన గాన మాధుర్యంతో అందర్నీ అలరించారు. ఒక్కసారిగా ఎయిటీస్‌లోకి శ్రోతల్ని తీసుకెళ్లిపోయారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 20, 2019, 12:32 PM IST
మళ్లీ పాడిన రణు మండల్... లతామంగేష్కర్ పాటకు నెటిజన్లు ఫిదా...
మళ్లీ పాడిన రాణు మండల్... లంతామంగేష్కర్ పాటకు నెటిజన్లు ఫిదా...
  • Share this:
Mumbai : ఒక్క పాట ఆమె జీవితాన్ని మార్చేసింది. ఎక్కడో రైల్వేస్టేషన్‌లో బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్న రాణు మండల్ అనుకోకుండా పాడిన ఓ పాట ఇంటర్నెట్‌లో సంచలనం అయ్యింది. ఆ పాటనను నెట్‌లో విన్న మ్యూజిక్ కంపోజర్ హిమేష్ రేషమ్మియా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెను కలిసి... ఏకంగా తన సినిమాలో ఆమెతో పాట పాడించాడు. ఆ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ప్రముఖ గాయని లతామంగేష్కర్ పాటలంటే అమితంగా ఇష్టపడే రాణు మండల్... తాజాగా లతా మంగేష్కర్‌ పాడిన మరో పాటను నెటిజన్ల కోసం పాడారు. అచ్చం లతా మంగేష్కర్ పాడినట్లే పాడటంతో... ఆ పాట విని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలు ఇంత చక్కగా ఆమె ఎలా పాడగలుగుతున్నారన్నది అందర్నీ ఆశ్చర్య పరుస్తున్న అంశం. ఆ తాజా పాటను మీరూ వినండి. 

View this post on Instagram
 

#ranumandal sings her favourite #latamangeshkar track @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on

ఓ రికార్డింగ్ స్టూడియోకి గెస్ట్‌గా వెళ్లిన రాణు మండల్... వారి కోరిక మేరకు కొన్ని పాటలు పాడింది. ప్రస్తుతం ఆమె చాలా బిజీ అయిపోయింది. రియాలిటీ షోలు, సినిమా ప్లేబ్యాక్‌లకు రమ్మని ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. అక్కడకు వెళ్లాక... ఆమెతో పాటలు పాడించుకొని... అవి వింటూ ఎంతో ఆనందపడుతున్నారు ప్రజలు. రోజూ ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు ఆమెను అడుగుతున్నారు. ఎక్కువ మంది అడిగే ప్రశ్న మాత్రం... మీరు ఇంత బాగా ఎలా పాడగలుగుతున్నారు అనే. ప్రస్తుతం రాణు మండల్... అంటే ఇదివరకటి మహిళ కాదు... ఇప్పుడు ఆమె వైరల్ సింగర్. ఆమె స్వరం నుంచీ వచ్చే ప్రతీ పాటా వైరల్ అవుతోంది.హిమేష్ రేషమ్మియా తన సినిమా కోసం రాణు మండల్‌తో "తేరీ మేరీ కహానీ" సాంగ్ పాడించారు. ఆ సాంగ్ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె ఓ ట్రెడిషనల్ సెలెబ్రిటీ అయిపోయారు. ఐతే... ఆ సాంగ్ పాడినప్పుడు... కొంతమంది... ఆమె ఆ ఒక్క సాంగే అలా పాడగలరనీ... అన్ని పాటలూ ప్రొఫెషనల్ సింగర్స్‌లా పాడలేరనీ కొందరు విమర్శించారు. ఐతే... రాణు మండల్ ఆ విమర్శలకు ఎంతో పాజిటివ్‌గా సమాధానం ఇచ్చారు. తనకు ప్రొఫెషనల్స్‌లా పాడటం రాదనీ, తనకు వచ్చినట్లు మాత్రమే తాను పాడుతున్నానని అన్నారు. అలా తనను తాను గొప్పగా చెప్పుకోకుండా... ఆమె ఎంతో హుందాతనాన్ని ప్రదర్శించారు.తాజాగా రాణు మండల్ పాడిన... "పాయ్‌నే కారణ్ వాలీ కవి దోర్తే నెహీ" సాంగ్... నెట్‌లో వైరల్ అయ్యింది. డౌట్ లేదు... ఆమె ఇప్పటికే ప్రొఫెషనల్స్‌లా పాడుతున్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని పాటలు పాడి శ్రోతల్ని అలరిస్తారని అనుకోవడంలో ఆశ్చర్యం అక్కర్లేదేమో.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>