హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lottery : నీ అదృష్టం మాములుది కాదు భయ్యో..ఆటో డ్రైవర్ కి లాటరీలో రూ.25 కోట్లు

Lottery : నీ అదృష్టం మాములుది కాదు భయ్యో..ఆటో డ్రైవర్ కి లాటరీలో రూ.25 కోట్లు

ఆటోడ్రైవర్ అనూప్

ఆటోడ్రైవర్ అనూప్

Onum Bumper Lottery : ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఓనం బంపర్ లాటరీ ఫలితాలను కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ ఇవాళ విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Onum Bumper Lottery : ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఓనం బంపర్ 2022 లాటరీ(Onum Bumper Lottery) ఫలితాలను కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ ఇవాళ విడుదల చేసింది. ఈసారి ఓ ఆటోడ్రైవర్ ని అదృష్టం వరించింది. ఓనం బంపర్ లాటరీ ఫలితాల్లో తిరువనంతపురంలోని శ్రీవరాహం నివాసి అయిన 32 ఏళ్ల ఆటో డ్రైవర్ అనూప్(Auto Driver Anoop)మొదటి విజేతగా నిలిచి రూ.25 కోట్లు గెల్చుకున్నాడు. కేరళ లాటరీ చరిత్రలో ఓనం బంపర్ లాటరీ అత్యధిక ప్రైజ్ మనీ ప్రకటించడం ఇదే తొలిసారి. కాగా,కేరళ లాటరీ డిపార్ట్ మెంట్ 67.50లక్షల లాటరీ టిక్కెట్లను ప్రింట్ చేయగా శనివారం సాయంత్రం నాటికి మొత్తం 66.40 లక్షల టిక్కెట్లు అమ్ముడపోయాయి.

ఆదివారం మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలను ప్రకటించారు. ఇందులో అనూప్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెంబర్ TJ750605కి ఫస్ట్ ఫ్రైజ్ లభించడంతో అతడి ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి.  తాను ఇప్పటికీ ఇదంతా నిజమని నమ్మకలేకపోతున్నాను అని మీడియాతో మాట్లాడుతూ అనూప్ తెలిపారు. తాను శనివారం రాత్రే టిక్కెట్ కొనుగోలు చేశానని తెలిపాడు. తనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. అనూప్ కి టిక్కెట్ అమ్మింది పజవంగాడి శ్రీ భగవతి ఏజెన్సీ(Pazhavangadi Sri Bhagavathy Agency). అనూప్..లాటరీ ఏజెంట్ సుజాయ(Sujaya)కి కజిన్ బ్రదర్.

Flying Bike : గాల్లో ఎగిరై బైక్ వచ్చేసిందిగా..దీని ధర,ఫీచర్లు తెలిస్తే వావ్ అనక తప్పదు!

కాగా,TJ 270912 నంబర్ గల టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి రెండో బహుమతి(Second Prize)రూ.5 కోట్లు గెలుచుకున్నారు. కొట్టాయంలోని మీనాక్షి లాటరీ ఏజెన్సీ వారు ఈ లాటరీ టిక్కెట్‌ను విక్రయించారు

Published by:Venkaiah Naidu
First published:

Tags: Kerala, Kerala Lottery, Lottery, Lottery Results

ఉత్తమ కథలు