సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) 72వ జన్మ దినోత్సవం జరుపుకొంటున్నారు. ఇప్పటి వరకు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat CM)గా, భారత ప్రధానిగా చాలా కీలక సమావేశాల్లో ప్రసంగించారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించే మేక్ ఇన్ ఇండియా (Make In India) వంటి ప్రచారాల నుంచి పరిశుభ్రమైన భారతదేశాన్ని సాధించే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ అభియాన్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా ఆయన చాలా దేశాల్లో అక్కడ స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులతో, ప్రముఖ టోర్నీలకు ముందు క్రీడాకారులతో మోదీ మాట్లాడుతూ స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపుతారు. కోవిడ్ సమయంలోనూ ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. పాటించాల్సిన నియమాలను వివరించారు.
ఈరోజు ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన కొన్ని స్ఫూర్తిదాయకమైన క్వోట్స్(Inspirational Quotes) చూద్దాం..
* అది మొదటి ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ యుద్ధం కావచ్చు, భారతదేశం ఎప్పుడూ ఇతర దేశాలపై దాడి చేయలేదు. భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు మేము ఏ దేశంపైనా దాడి చేయలేదు.
* మాటలు, ప్రవర్తనలో మహిళలపై గౌరవం చూపాలి. ఏ విధమైన చర్యలతోనూ వారి గౌరవాన్ని తగ్గించకుండా ఉండటం ముఖ్యం.
* చిన్న నీటి బిందువులే మహా సముద్రాన్ని సృష్టిస్తాయి. అదే విధంగా భారతదేశంలోని ప్రతి పౌరుడు ‘వోకల్ ఫర్ లోకల్’ అనే మంత్రాన్ని అనుసరిస్తే, దేశం స్వయం శక్తిగా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టదు.
* అభివృద్ధి కోసమే నేను ఎన్నికల్లో పోటీ చేశాను. ఇది నా నమ్మకం, ఇది నా నిబద్ధత. దేశంలోని యువత అభివృద్ధిని నమ్ముతున్నారు. అభివృద్ధే అన్ని సమస్యలకు పరిష్కారం.
* ప్రజల ఆశీర్వాదం మీకు అవిశ్రాంతంగా పని చేసే శక్తిని ఇస్తుంది. నిబద్ధత మాత్రమే అవసరం.
* మీ స్నేహం మా గౌరవం; మీ కలలు మా కర్తవ్యం. భారతదేశ సామర్థ్యం పరిమితం కావచ్చు, కానీ మన నిబద్ధతకు పరిమితులు లేవు. మా వనరులు నిరాడంబరంగా ఉండవచ్చు, కానీ మా సంకల్పం అనంతమైంది.
ఇది కూడా చదవండి : చాయ్ వాలా టు ప్రధాని.. మోదీ జీవితంలోని కీలక పరిణామాలు తెలుసుకోండి..
* అభివృద్ధిని అందరూ కలిసి సమిష్టిగా, వేగంగా సాధించాలి.
* ప్రతి ఒక్కరూ సహకరించగల వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం. 125 కోట్ల మంది భారతీయుల శక్తి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది.
* తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నెరవేరని కలలను పిల్లలపై బలవంతంగా రుద్దలేరు. ప్రతి బిడ్డ తన కలలను అనుసరించడం చాలా ముఖ్యం.
* మానవత్వాన్ని విశ్వసించే వారు దాని కోసం ఐక్యంగా పోరాడటానికి కలిసి రావాలి. ఈ విపత్తుకు వ్యతిరేకంగా ఒకే స్వరంతో మాట్లాడాలి. ఉగ్రవాదానికి చట్టబద్ధత రద్దు చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra Modi Birthday, National News, PM Narendra Modi