హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sad Story: పెళ్లి చేసుకుని తమ ప్రేమను నెగ్గించుకున్నారు.. కానీ, ఐదు రోజుల తర్వాత జరిగిన ఘోరమిది!

Sad Story: పెళ్లి చేసుకుని తమ ప్రేమను నెగ్గించుకున్నారు.. కానీ, ఐదు రోజుల తర్వాత జరిగిన ఘోరమిది!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగిందన్న సంతోషం అతనిలో పెళ్లి తర్వాత కనిపించకుండా పోయింది.. ఇలాంటి అత్తామామలతో జీవితమంతా నరకమేనని అనిపించింది.. పెళ్లి జరిగి అప్పటికే ఐదు రోజులే గడిచాయి..

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు.. పెళ్లికి ముందు అంతా బాగానే ఉంది.. పెళ్ల తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయిని వేధించడం మొదలుపెట్టారు.. చిత్రహింసలకు గురిచేశారు.. హద్దు దాటి దాడి కూడా చేశారు.. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. వయసేమో 22ఏళ్లు.. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగిందన్న సంతోషం అతనిలో పెళ్లి తర్వాత కనిపించకుండా పోయింది.. ఇలాంటి అత్తామామలతో జీవితమంతా నరకమేనని అనిపించింది.. పెళ్లి జరిగి అప్పటికే ఐదు రోజులే గడిచాయి.. ఇంతలోనే అతనిలో సూసైడ్‌ థాట్స్‌ వచ్చాయి. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెళ్లైన ఐదు రోజులకే:

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఓ ప్రేమ కథ విషాదంగా ముగిసింది. చాలా ఏళ్లుగా వాళ్లని ప్రేమ బంధం విడతియ్యలేకపోయింది కానీ.. పెళ్లి మాత్రం ఐదు రోజుల్లోనే వారి బంధాన్ని తెంచేసింది. పెళ్లయిన తర్వాత భార్య కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురిచేస్తుండడంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లఖింపూర్ ఖేరీలోని శరత్ పూర్ గ్రామానికి చెందిన ధీరజ్‌ అదే గ్రామానికి చెందిన రోలీ గిరిని ప్రేమించాడు. మార్చి 14న లక్నోలోని ఆర్యసమాజ్‌లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత లక్నోలో అద్దెకు ఉంటున్నాడు. మార్చి 18న ధీరజ్ తనను గదిలో బంధించి హాల్లో ఆత్మహత్య చేసుకున్నాడని రోలీ చెబుతోంది. తాను ఎలాగోలా తలుపులు పగులగొట్టి ధీరజ్‌ను ఉరి ఉచ్చు నుంచి బయటకు తీసి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లానని తెలిపింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ధీరజ్‌ను బలరాంపూర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన ధీరజ్ రెండు రోజుల పాటు క్రిటికల్ కేర్ యూనిట్‌లో మృత్యువుతో పోరాడి చనిపోయాడు.

అత్తామామలు చేసిన పనికి..

ధీరజ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న వెంటనే రోలీ తన తండ్రితో పాటు ధీరజ్‌ తండ్రి సునీల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పిది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. కోడలు, కుటుంబ సభ్యులు తమ కుమారుడిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ధీరజ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రేమ వివాహం కారణంగా బావమరిదిని కూడా కొట్టినట్లు చెబుతున్నారు. దీంతో ధీరజ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Husban commits suicide, Marriage, Suicide, Uttar pradesh

ఉత్తమ కథలు