స్మృతి ఇరానీ మిస్సింగ్... ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్ కలకలం...

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మిస్సింగ్ అయినట్లు ఉత్తరప్రదేశ్‌లో ఓ పోస్టర్ కలకలం రేపింది. అసలేమైందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 2, 2020, 9:47 AM IST
స్మృతి ఇరానీ మిస్సింగ్... ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్ కలకలం...
స్మృతి ఇరానీ మిస్సింగ్... ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్ కలకలం... (File)
  • Share this:
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్ నియోజకవర్గమైన... ఉత్తరప్రదేశ్... అమేథీలో ఓ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఇప్పుడు కలకలం రేపుతోంది. అందులో... స్మృతి ఇరానీ ఫొటోతోపాటూ... మా ఎంపీ ఎమైపోయారో, ఎక్కడున్నారో అంటూ... కొంత మేటర్ ఉంది. ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటానని మాటిచ్చిన మంత్రి... రెండేళ్లలో... రెండు రోజుల్లో... కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉన్నారని పోస్టర్‌లో వివరాలున్నాయి. ఇలాంటి పోస్టర్లను అక్కడి కాంగ్రెస్ మహిళా విభాగం విడుదల చేసింది. ఈ విషయం తెలుసుకున్న స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో కౌంటర్ ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్ కలకలం


8 నెలల్లో పది సార్లు అమేథీకి వెళ్లాననీ... 14 రోజులు అక్కడ ఉన్నాననీ 44 ఏళ్ల స్మృతీ ఇరానీ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ... తన సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీకి ఎన్నిసార్లు వెళ్లారో చెప్పాలని స్మృతి డిమాండ్ చేశారు.

యూపీలోని అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. 40 ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వరకూ అది రాహుల్ గాంధీ నియోజకవర్గంగా ఉంది. అక్కడ 2019లో స్మృతి ఇరానీ ఎంపీగా గెలవడంతో... సీన్ మారింది. ఆ నియోజకవర్గం బీజేపీ వశమైంది. కరోనా లాక్‌డౌన్ కాలంలో... అమేథీ కోసం తాను ఏమేం పనులు చేసిందీ చెప్పిన ఇరానీ... చాలా మంది వలస కూలీలు అమేథీకి వచ్చేందుకు సాయపడ్డానన్నారు. అలాగే... ప్రధానమంత్రి పథకాల ద్వారా... రైతులకు మేలు జరిగేలా చేశానన్నారు.


బస్సుల్లో 22150 మంది వలస కూలీలు, రైళ్లలో 8322 మంది వలస కూలీలు అమేథీకి వచ్చారన్న ఇరానీ... రాయ్‌బరేలీకి సోనియా గాంధీ అంత మందిని తెప్పించారా అని ప్రశ్నించారు. లాక్‌డౌన్ కాలంలో అమేథీకి ఎందుకు రాలేదో చెప్పిన ఆమె... తాను రూల్స్ బ్రేక్ చేస్తే... ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అలా రాలేదని చెప్పారు.


మొత్తానికి సోనియా గాంధీతో తనను పోల్చుకోవడం ద్వారా... స్మృతి ఇరానీ... తాను రాహుల్ గాంధీ కంటే... పైమెట్టులో ఉన్నట్లుగా చెప్పకనే చెబుతున్నారు. తన జోలికి వస్తే... మాటకు మాట సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మరోసారి నిరూపించారు ఈ ఫైర్ బ్రాండ్ మంత్రి.
First published: June 2, 2020, 9:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading