Ayodhya Dispute : ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సున్నీ వక్ఫ్ బోర్డు..

Ayodhya Dispute: అయోధ్య-బాబ్రీ మసీదు కేసులో ప్రధాన కక్షిదారుగా ఉన్న వక్ఫ్ బోర్డు కేసును ఉపసంహరించుకోవాలనుకోవడం ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టయింది.

news18-telugu
Updated: October 16, 2019, 1:12 PM IST
Ayodhya Dispute : ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సున్నీ వక్ఫ్ బోర్డు..
అయోధ్య రైల్వే స్టేషన్
news18-telugu
Updated: October 16, 2019, 1:12 PM IST
అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించనుంది. అయితే తీర్పు వెల్లడికి కొద్ది గంటల ముందే సున్నీ వక్ఫ్ బోర్డు కేసు నుంచి తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి సిద్దపడింది. అటు హిందూ,ఇటు ముస్లిం వర్గాల మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ప్యానెల్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.పిటిషన్ ఉపసంహరణకు వక్ఫ్ బోర్డు ఇచ్చిన వినతిపత్రాన్ని బుధవారం సుప్రీం కోర్టుకు అందజేసింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ అహ్మద్ ఫరూఖీ ఆ వినతిపత్రాన్ని ప్యానెల్‌కు అందజేశారు. అయోధ్య-బాబ్రీ మసీదు కేసులో ప్రధాన కక్షిదారుగా ఉన్న వక్ఫ్ బోర్డు కేసును ఉపసంహరించుకోవాలనుకోవడం ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టయింది.

వక్ఫ్ బోర్డు సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు.. ఫారుఖిపై ఎఫ్ఐఆర్‌లు నమోదైన నేపథ్యంలో పిటిషన్ ఉపసంహరణకు సిద్దపడినట్టు తెలుస్తోంది. వక్ఫ్ బోర్డు భూముల్లో జరిగిన అవకతవకలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సీబీఐ విచారణను కోరింది.మరోవైపు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఫారుఖి తమ తరుపు న్యాయవాదిని మార్చేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం ప్యానెల్‌కి లేఖ కూడా రాసిన ఆయన.. తమ న్యాయవాద బృందానికి తెలియకుండా చర్చలు జరపాలనుకుంటున్నట్టు తెలిపారు.ఫారూఖీ అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టే.. కేసును ఉపసంహరించుకోవాలనుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.





First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...