హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Taj Mahal: ఫిబ్రవరి నెలలో ఆ రోజు 4 గంటల పాటు తాజ్‌మహల్‌ లోకి నో ఎంట్రీ.. ప్లాన్ మార్చుకోండి..!

Taj Mahal: ఫిబ్రవరి నెలలో ఆ రోజు 4 గంటల పాటు తాజ్‌మహల్‌ లోకి నో ఎంట్రీ.. ప్లాన్ మార్చుకోండి..!

Taj Mahal: ఫిబ్రవరి నెలలో ఆ రోజు 4 గంటల పాటు తాజ్‌మహల్‌ లోకి నో ఎంట్రీ.. ప్లాన్ మార్చుకోండి..!

Taj Mahal: ఫిబ్రవరి నెలలో ఆ రోజు 4 గంటల పాటు తాజ్‌మహల్‌ లోకి నో ఎంట్రీ.. ప్లాన్ మార్చుకోండి..!

Taj Mahal: కళ్లు తిప్పుకోనీయని తాజ్‌మహల్‌ అందం అత్యధికంగా టూరిస్టులను అట్రాక్ట్‌ చేస్తోంది. విదేశాల నుంచి సైతం సందర్శకులు తాజ్‌మహల్‌ను చూడటానికి వస్తుంటారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు జీవితంలో కనీసం ఒక్కసారైనా తాజ్‌మహల్‌ (Taj Mahal)ను చూడాలని ఆశపడుతారు. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌, ముంతాజ్‌ ప్రేమకు గుర్తుగా ఆగ్రాలో నిర్మించిన ఈ అద్భుత నిర్మాణం ఏడు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది. కళ్లు తిప్పుకోనీయని తాజ్‌మహల్‌ అందం అత్యధికంగా టూరిస్టులను అట్రాక్ట్‌ చేస్తోంది. విదేశాల నుంచి సైతం సందర్శకులు తాజ్‌మహల్‌ను చూడటానికి వస్తుంటారు. అయితే ఫిబ్రవరి 12న తాజ్‌మహల్‌ సందర్శనకు వస్తున్న పర్యాటకులు కాస్త ప్రణాళిక మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

* G20 సమ్మిట్ కారణంగా చర్యలు

ఇండియా G20 కూటమికి నేతృత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. 2022 డిసెంబర్ 1న ఇండియా G20 ప్రెసిడెన్సీ స్వీకరించింది. G20 సదస్సులో పాల్గొనేందుకు సభ్య దేశాల ప్రతినిధులు ఫిబ్రవరి 10- 12 వరకు ఆగ్రాను సందర్శించనున్నారు. దీంతో ఈ సంవత్సరం ఫిబ్రవరి 12న నాలుగు రోజుల పాటు తాజ్‌మహల్‌ పర్యటన నాలుగు గంటలపాటు నిలిపివేయనున్నారు.

G20 సమావేశానికి అతిథులను స్వాగతించడానికి ఆగ్రా సిద్ధమవుతోంది. అతిథుల రాక కోసం తాజ్‌మహల్‌ సందర్శన కొన్ని గంటలపాటు నిలిపివేస్తున్నారు. G20 అతిథులు మాత్రమే ప్రవేశించడానికి అనుమతి ఇస్తారు. అతిథులు తాజ్‌మహల్‌ గొప్పతనం, ఇండియా నిర్మాణ నైపుణ్యాల గురించి తెలుసుకునే సమయంలో పర్యాటకులు ఇతర ఆగ్రా అందాలను చూడటానికి ప్లాన్‌ చేసుకోవచ్చు. కానీ వారి రాక సమయం ఇంకా నిర్ణయించలేదు.

* ఆగ్రా సుందరీకరణలో స్థానిక యంత్రాంగం

జీ20 సదస్సు కారణంగా ఆగ్రాను సుందరంగా తీర్చిదిద్దేందుకు స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా G20 సభ్యుల ప్రతినిధి బృందం ప్రయాణించే మార్గాన్ని ఆకర్షణీయంగా మారుస్తోంది. ఈ కార్యక్రమాలకు ఆగ్రా డివిజనల్ కమిషనర్ అమిత్ గుప్తా, జిల్లా మేజిస్ట్రేట్ నవనీత్ చాహల్, పోలీస్ కమిషనర్ ప్రితీందర్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి : భూతల స్వర్గాన్ని చూడాలనుకుంటున్నారా..? ఈ IRCTC టూర్ ప్యాకేజీ మీ కోసమే..

క్లీనింగ్, రిపేర్ ప్రాజెక్ట్‌లు, బహిరంగ ప్రదేశాల్లో చెట్లను పెంచడం, పబ్లిక్ పార్కులు, వినోద ప్రదేశాలను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త వీధి దీపాలు, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయడం పనులు చేపడుతున్నారు. G20 సమ్మిట్‌తో సాధారణ ప్రజలను కనెక్ట్ చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తోంది.

* తాజ్‌మహల్‌ టిక్కెట్లు, సమయం

తాజ్‌మహల్‌ సందర్శన వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. పర్యాటకులకు శుక్రవారాల్లో ఈ స్మారక చిహ్నం చూసేందుకు అవకాశం ఉండదు. సూర్యోదయానికి ఒక గంట ముందు నుంచి సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు వరకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. పగటిపూట తాజ్‌మహల్‌ను చూసేందుకు ఇండియాకు చెందిన పర్యాటకులు అయితే ఎంట్రీ ఫీజ్‌ రూ.50 చెల్లించాలి. అదే విధంగా SAARC, BIMSTEC దేశాలకు చెందిన పౌరులు రూ.540 పే చెయ్యాలి. ఇతర దేశాలకు చెందిన టూరిస్టులు అయితే రూ.1,100 చెల్లించాల్సి ఉంటుంది.సమాధి సందర్శించాలని కోరుకునే వాళ్లు(ఆప్షనల్‌)రూ.200 చెల్లించాలి.

First published:

Tags: G20 Summit, National News, Taj Mahal, Travel

ఉత్తమ కథలు