తొమ్మిది నెలల బిడ్డతో మహిళా కానిస్టేబుల్ ఎన్నికల ‘కర్తవ్యం’

ఎండల్లో ఎలాంటి అలసట లేకుండా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న ఆ కానిస్టేబుల్‌ను చూసి సహచర పోలీసులు, ప్రజలు కూడా అభినందించకుండా ఉండలేకపోయారు.

news18-telugu
Updated: April 17, 2019, 10:13 PM IST
తొమ్మిది నెలల బిడ్డతో మహిళా కానిస్టేబుల్ ఎన్నికల ‘కర్తవ్యం’
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 17, 2019, 10:13 PM IST
అటు అమ్మ. ఇటు కర్తవ్యం. రెండింటికీ సమన్యాయం చేసేందుకు ఆ తల్లిపడిన కష్టాన్ని అందరూ అభినందించకుండా ఉండలేకపోయారు. అసోంలోని ధరమ్‌తుల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శాంసల్ నేహార్‌కు ఎలక్షన్ డ్యూటీ వేశారు. దీంతో ఆమె తన తొమ్మిదేళ్ల బిడ్డతో కలసి ఎన్నికల విధులకు హాజరైంది. ఓ వైపు ముఖంపై చెరగని చిరునవ్వుతో, మరోవైపు ఎన్నికల విధులతో మిగిలిన వారితో కలసి ఆమె కూడా ఎలక్షన్ డ్యూటీకి వెళ్లే వారు ఎక్కే బస్సు ఎక్కింది. అప్పటి వరకు ఓ బంధువు వద్ద ఆడుకున్న చిన్నారి, తల్లి బస్సు ఎక్కే సమయానికి ఆమెతో కలసి వెళ్లింది. ఎండల్లో ఎలాంటి అలసట లేకుండా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న ఆ కానిస్టేబుల్‌ను చూసి సహచర పోలీసులు, ప్రజలు కూడా అభినందించకుండా ఉండలేకపోయారు.



First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...