ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగంపై నాసా రియాక్షన్..

Chandrayaan-2 : మొత్తం రూ.978కోట్ల ఖర్చుతో చేపట్టిన చంద్రయాన్-2 ఈ నెల 15న లాంచ్ జరగాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలతో వాయిదాపడిన సంగతి తెలిసిందే. సోమవారం రోజు తిరిగి చంద్రయాన్-2ని లాంచ్ చేయగా.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

news18-telugu
Updated: July 23, 2019, 9:05 AM IST
ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగంపై నాసా రియాక్షన్..
చంద్రయాన్-2 లాంచ్ అవుతున్న దృశ్యం..
  • Share this:
ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంగా లాంచ్ కావడంపై నాసా స్పందించింది.ఇస్రోకి శుభాకాంక్షలు తెలిపిన నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువ విశేషాలపై చంద్రయాన్-2 ఎలాంటి సమాచారం అందించబోతుందోనన్న ఆసక్తితో మున్ముందు అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇస్రో జరిపిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రపంచ దేశాలన్ని ఆసక్తిగా తిలకించాయి.

చంద్రయాన్-2ని విజయవంతంగా లాంచ్ చేసినందుకు శుభాకాంక్షలు. ఇస్రో చేపట్టిన ఈ మిషన్‌కు మద్దతుగా నిలిచినందుకు మేము గర్విస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువ విశేషాలపై చంద్రయాన్-2 అందించే సమాచారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మరికొద్ది సంవత్సరాల్లో అదే దక్షిణ ధ్రువం పైకి #Artemis మిషన్ ద్వారా మేము వ్యోమోగాములను పంపించబోతున్నాం.
నాసా,అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ


మొత్తం రూ.978కోట్ల ఖర్చుతో చేపట్టిన చంద్రయాన్-2 ఈ నెల 15న లాంచ్ జరగాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలతో వాయిదాపడిన సంగతి తెలిసిందే. సోమవారం రోజు తిరిగి చంద్రయాన్-2ని లాంచ్ చేయగా.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వి మార్క్‌-3ఎమ్‌-1 రాకెట్‌ విజయవంతంగా దాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించేందుకు 48రోజులు పడుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగేందుకు ఆర్బిటర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విడిపోతుంది.చంద్రుడిపై దిగిన వెంటనే విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వస్తుంది. ఇది 14రోజుల పాటు చంద్రుడిపై

పరిశోధనలు జరపనుంది.


First published: July 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు