Video : ముంబైలో సరికొత్త వాటర్‌ఫాల్స్... తరలివస్తున్న టూరిస్టులు..

Mumbai Rains : ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ముంబై మునిగిపోతుంటే... అక్కడి ప్రజలు మాత్రం కొత్తగా వచ్చిన వాటర్‌ఫాల్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. దాని దగ్గరకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 12:46 PM IST
Video : ముంబైలో సరికొత్త వాటర్‌ఫాల్స్... తరలివస్తున్న టూరిస్టులు..
భవనం పైనుంచీ పడుతున్న జలధార (Image : Twitter - K Sudarshan)
Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 12:46 PM IST
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజంతా రెడ్ అలర్ట్ ఉంది. కొంకణ్ ప్రాంతం మొత్తం మునిగిపోయింది. అక్కడి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రజలు ఇళ్లలోంచీ బయటకు రావొద్దని అధికారులు కోరారు. ఐతే... ట్విట్టర్‌లో ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. అందులో ఓ స్కైస్క్రాపర్ పై నుంచీ వరద నీరు... జలపాతంలా పడుతోంది. చూడటాడానికి ఆ వ్యూ చాలా బాగుండటంతో... అటుగా వెళ్లేవారంతా... ఒక్క క్షణం ఆగి, ఆశ్చర్యపోతూ... సెల్ఫీలు తీసుకుంటున్నారు. సిటీలోని కఫ్పె పరేడ్‌లోని 40 అంతస్థుల భవనం పై నుంచీ నీరు ధారలా పడుతోంది. ఎక్కడో అడవుల్లో కనిపించే జలపాతం... సిటీ మధ్యలో కనిపిస్తుండటంతో... జనం థ్రిల్ ఫీలవుతున్నారు.


ట్విట్టర్‌లో కె.సుదర్శన్ ఈ వీడియోని పోస్ట్ చేశారు. వెంటనే ఇది వైరల్ అయ్యింది. నెటిజన్లు దీన్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. 700 మందికి పైగా దీన్ని రీట్వీట్ చెయ్యగా... 73వేల మంది దీన్ని చూశారు. వాటర్ ఫాల్స్ చూసేందుకు బిల్డర్ టికెట్ పెడతారని ఆశిస్తున్నట్లు ఓ నెటిజన్ తెలపగా... ముఖ్యమైన జల వనరులను వేస్ట్ చేస్తున్నారని మరో యూజర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ భవన నిర్మాణదారు... వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఎందుకు చేపట్టట్లేదని ప్రశ్నించారు. ఇదో టూరిస్ట్ డెస్టినేషన్ అవుతుందని మరో యూజర్ అన్నారు.




చైనాలో నిజంగానే ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ... ఓ యూజర్... ఆ వీడియో షేర్ చేశారు.
First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...