హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Omicron: ఈ రాష్ట్రాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Omicron: ఈ రాష్ట్రాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Omicron: ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఏ రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి? ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

Omicron: ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఏ రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి? ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

Omicron: ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఏ రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి? ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

    భారత్‌ను ఒమిక్రాన్ (Omicron Variant) భయం వణికిస్తోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 200 దాటింది. త్వరలోనే 300లకు చేరే అవకాశముంది. మరో రెండు రోజుల్లో క్రిస్మస్ పండగ (Christmas) ఉంది. ఆ తర్వాత న్యూఇయర్ వేడుకలు (New Year Celebrations) జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రజలు ఎక్కువగా గుమిగూడితే ఒమిక్రాన్ మరింతగా వ్యాప్తి చెందవచ్చని ఆందోళన చెందుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. మరి క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఏ రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి? ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

    ఢిల్లీ:

    ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ఢిల్లీలో కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. సభలు, సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలపై ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిషేధం విధించింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడవద్దని స్పష్టం చేసింది. అటు బార్లు, రెస్టారెంట్లు 50శాతం సీటింగ్ కెపాసిటీతోనే నిర్వహించాలి. డిసెంబరు 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

    ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. అది లేనిదే నెల జీతం రాదు..

    కర్నాటక:

    బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్డులలో జనాలు గుమిగూడడానికి వీల్లేదు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే న్యూ ఇయర్ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు ఇది అమల్లో ఉంటుంది. పబ్బులు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతోనే నడవాలి. అందులో పనిచేసే సిబ్బంది ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని ఉండాలి.

    మహారాష్ట్ర:

    మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 31 వరకు ముంబైలో 144 సెక్షన్ విధించారు. నగర పరిధిలోని బీచ్‌లోలు, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమిగూడటానికి వీల్లేదు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో 200 మంది కంటే ఎక్కువ మంది పాల్గొంటే ఖచ్చితంగా బీఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలి. బార్లు, రెస్టారెంట్లు వంటి క్లోజ్‌డ్ ప్లేసెస్‌లో 50శాతం సీటింగ్ కెపాసిటీ నిబంధనను ఖచ్చితంగా పాటించాలి. 6*6 ఫీట్ల సామాజిక దూరాన్ని మెయింటేన్ చేయాలి.

    Omicron Tension: మళ్లీ స్కూళ్ల మూసివేత..? మంత్రి వ్యాఖ్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన

    గుజరాత్‌:

    గుజరాత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. అర్ధరాత్రి 1 నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించారు. డిసెంబరు 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. జిమ్‌లు, రెస్టారెంట్లు 75శాతం సామర్థ్యంతో మాత్రమే నిర్వహించుకోవాలి. సినిమా హాళ్లు మాత్రం 100శాతం సీటింగ్ కెపాసిటీతో నడవచ్చు.

    Omicron Effect on India: క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు.. డీడీఎంఏ ఆదేశాలు

    పశ్చిమ బెంగాల్:

    బెంగాల్‌లో ఒకే ఒక్క ఒమిక్రాన్ కేసు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంక్షలను కాస్త సడలించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ (రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు)ని జనవరి 15 వరకు పొడిగించారు. ఐతే క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    ఉత్తమ కథలు