Home /News /national /

OMICRON TEST RESULT WITH IN THE TWO HOURS ICMR ANNOUNCED VRY

Omicron Testing kit : రెండు గంటల్లో ఒమిక్రాన్ ఫలితం.. కొత్త కిట్ పై ఐసిఎంఆర్ ప్రకటన

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Omicron Testing kit : కరోనా కొత్త వేరియంట్‌ను రెండు గంటల్లోనే గుర్తించే టెస్టింగ్‌ కిట్‌ను రూపోందించినట్టు ఐసిఎమ్‌ఆర్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది.

    కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాధి నిర్ధారణకు రోజుల సమయం పడుతోంది. దీంతో వ్యాధి ఫలితాలు వచ్చే సరికి పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. కాగా ఒమిక్రాన్ వ్యాధి నిర్ధారణకు ప్రస్తుతం జీనోమ్ సీక్వేన్సింగ్‌కు పంపాల్సి వస్తోంది. దీంతో దాని ఫలితాలు రావడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతోంది. దీంతో వ్యాది నిర్ధారణ, కట్టడికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిని వైద్యులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి నుండి బయటపడేందుకు ఐసీఎంఆర్‌ దిబ్రూగఢ్‌ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు బృందం ఓ అద్భుతమైన టెస్టింగ్ కిట్‌ను కొనుగొన్నట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. ఈ కిట్‌తో కొత్త వేరియంట్ ఫలితాలను కేవలం రెండు గంటల్లోనే కనుక్కొవచ్చిని వెల్లడించారు.

    100% ఫలితం

    ఒమిక్రాన్‌లోని ప్రత్యేక సింథటిక్‌ జన్యు భాగంపై పరీక్షలు నిర్వహించారు. ఇందులో వందశాతం ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని ఐసిఎంర్ తెలిపింది. ప్రస్తుతం వేరియంట్‌ను గుర్తించేందుకు టార్గెటెడ్ సీక్వెన్సింగ్‌కు 36 గంటలు, జీనోమ్ సీక్వెన్సింగ్‌కు 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని, కిట్‌ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని డాక్టర్ బోర్కకోటి చెప్పారు. ప్రత్యేకమైన విషయమేంటంటే సాధారణ స్వాబ్‌ శాంపిల్‌ ద్వారా వైరస్‌ను గుర్తించారు. ఈ కిట్‌ను పూర్తిగా ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో తయారు చేస్తుండగా.. కోల్‌కతాలోని డీసీసీ బయోటెక్‌కు ఐసీఎంఆర్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది.

    Marriage : మండపంలో వధువు... పీకలదాకా తాగిన వరుడు.. కట్ చేస్తే.


    భారత్‌లో కొత్త వేరియంట్‌ కేసులు 35కి పెరిగాయి. పలు రాష్ట్రాలకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి కొవిడ్‌ పాజిటివ్‌ కాగా.. నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కాగా కొత్తగా వచ్చినట్టయితే...మరింత త్వరగా ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.

    CM kcr : జిల్లాల పర్యటనలో సీఎం కేసిఆర్.. ఫలితాల తర్వాత టూర్..

    Published by:yveerash yveerash
    First published:

    Tags: ICMR, Omicron

    తదుపరి వార్తలు