దేశంలో కోవిడ్ 19 కేసుల (Covid 19 Cases) సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 124 మరణాలు సంభవించాయి. దీంతో 11,007 రికవరీలతో.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,71,830 కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం. మంగళవారం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది. దేశంలో మహారాష్ట్ర (Maharashtra) లో అత్యధికంగా 568 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 382 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత కేరళలో 185, రాజస్థాన్‌లో 174లో.. గుజరాత్ లో152 కేసులు వచ్చాయి. దేశంలో కొన్ని వారాలుగా కరోనా (Corona) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ (Omicron) వేగంగా విస్తరిస్తున్నట్టు వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. 3 వారాల క్రితం Omicron ఇన్ఫెక్షన్ రేటు కేవలం 2%. ఇది 30 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అన్ని కరోనా కేసులలో Omicron ఇన్ఫెక్షన్ రేటు 60 శాతంగా వైద్యులు గుర్తించారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా..
తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పరీక్షల్లో తనకు వ్యాధి సోకిందని తేలిందని చెప్పారు. తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. ఇంట్లో నన్ను నేను ఏకాంతంగా ఉంటున్నాను అని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత కొన్ని వారాలుగా, ఆప్ కన్వీనర్ ఎన్నికల ప్రచారంలో సుడిగాలిలో ఉన్నారు మరియు పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో పర్యటించారు.
COVID 19 Vaccine: పిల్లలకు కోవిడ్ టీకాలు.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకోండి!
I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022
Omicron: ఒమిక్రాన్ ఓ సాధారణ వైరల్ ఫివర్.. భయపడాల్సిన పనిలేదు: యూపీ సీఎం ఆదిత్యనాథ్
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.