కరోనా ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఈ కొత్త కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు టీకా తప్పనిసరిగా తీసుకొని ఉండాలి అంతే కాకుండా ఎయిర్‌పోర్ట్ (Airport)లో ఆర్టీపీసీఆర్ (RT-PCR) పరీక్ష చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనల కారణంగా RT-PCR పరీక్ష రేట్లు.. ఎయిర్‌పోర్టులో క్యూలు, రద్దీ అంశాలు అంతర్జాతీయ ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని విమానాశ్రయాలు ర్యాపిడ్ టెస్ట్ (Rapid Test) కోసం రూ. 3,000 కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఏఏ విమానాశ్రయాల్లో ఎంత చార్జీలు తీసుకొంటున్నారో.. చూద్దాం
ముంబై విమానాశ్రయం..
- ముంబై (Mubai) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ రేటును గతంలో రూ.4,500గా ఉండగా, ప్రస్తుతం ఒక్కో పరీక్షకు రూ.3,900కి తగ్గించింది.
- సాధారణ RT-PCR పరీక్షకు రూ. 600 ఖర్చవుతుందని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో ర్యాపిడ్ ఆర్‌టి-పిసిఆర్ పరీక్షల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రదీప్ వ్యాస్ మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
ఢిల్లీ విమానాశ్రయంలో..
- ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు పరీక్షఉన్నాయి. మొదటిది పరీక్ష కోసం రూ. 500 చెల్లించాలి. పరీక్ష ఫలితాలు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పడుతుంది.
- రెండోది ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ కోసం రూ.3,500 చెల్లించి దాదాపు 60 నుంచి 90 నిమిషాల్లో రిపోర్టు పొందవచ్చు.
చెన్నై విమానాశ్రయంలో..
- చెన్నై (Chennai)అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం తన ఆర్టీ-పీసీఆర్ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ర్యాపిడ్ PCR పరీక్షకు రూ. 2,900గా ధర నిర్ణయించారు. గతంలో రూ. 3, 400గా ఉంది.
కోల్‌కతా విమానాశ్రయంలో..
కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం సాధారణ RT-PCR పరీక్షకు రూ. 700గా ఉంది ఈ పరీక్ష ఫలితానికి ఆరుగంటల సమయం పడుతుంది. ర్యాపిడ్ PCR పరీక్షకు రూ. 3,600 వసూలు చేస్తున్నారు ఈ పరీక్ష ఫలితాలకు సమయం ఒక గంట పడుతుంది.
Omicron: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఏమిటి?.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
బెంగళూరు విమానాశ్రయంలో..
బెంగళూరు (Bangalore)లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో, సాధారణ RT-PCR పరీక్ష అంటే ఫలితాలకు ఐదు గంటల సమయం పడుతుంది. ఈ పరీక్షకు రూ.500గా నిర్దేశించారు. 25 నిమిషాల్లో వచ్చే సెఫీడ్ జీన్ ఎక్స్‌పర్ట్ పరీక్షకు ధర రూ. 2,750గా ఉంది.
అహ్మదాబాద్..
- సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ర్యాపిడ్ పిసిఆర్ పరీక్షకు ప్రయాణికుడికి రూ. 2,700 ఖర్చు అవుతుంది.
కాలికట్ విమానాశ్రయంలో..
కేరళలోని కోజికోడ్ కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ ధరలను రూ.1,580గా నిర్దేశించారు.
హైదరాబాద్ విమానాశ్రయంలో..
హైదరాబాద్ (Hyderabad) జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో RT-PCR పరీక్షకు రూ. 750 మరియు ర్యాపిడ్ PCR పరీక్షకు రూ. 3,900 ఖర్చు అవుతుంది. విమానాశ్రయంలో పరీక్షలను బుక్ చేయడానికి Mapmygenome అనే నిర్దేశిత ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
విమానాశ్రయాలలో RT-PCR అండ్ రాపిడ్ RT-PCR పరీక్షల్లో ఆదాయం వాటాను ఉపసంహరించుకోవాలిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అన్ని రీజినల్ హెడ్‌లకు లేఖ రాసింది. ప్రస్తుత ఏర్పాటు ప్రకారం, విమానాశ్రయాలలో పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలలు వసూలు చేసే రుసుములో కొంత శాతాన్ని విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ఏజెన్సీతో పంచుకుంటారు. పరీక్షల ఖర్చును తగ్గించడం ద్వారా ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చాలని లేఖలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airport, Bangalore, Chennai, Corona test, Covid test, Delhi Airport, Hyderabad, Shamshabad Airport