కోవిడ్ -19 యొక్క ఓమిక్రాన్ (Omicron) వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (Disaster Management Authority) క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల నిర్వహణను అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకొంది. డీడిఎంఎ డిసెంబర్ 15, 2021 నాటి ఉత్తర్వుల ప్రకారం, అన్ని సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలు నిషేధించింది. ఢిల్లీ (Delhi) లో ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని తెలిపింది. ఢిల్లీలోని NCTలో క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి ఎటువంటి అనుమతి లేదని తెలిపింది. సాంస్కృతిక కార్యక్రమాలు/సమావేశాలు/సమ్మేళనాలు జరగకుండా అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లు, DCPలు చూసుకోవాలని పేర్కొంది.
ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు డీడీఎంఏ గుర్తించదన్నారు. ఆంక్షలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లు అలాగే అన్ని జిల్లాల DCPలు వారి సంబంధిత ప్రాంతాల్లో సర్ప్రై తనిఖీలు/దాడులు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Omicron in India: దేశంలో 213 ఒమిక్రాన్ కేసులు.. ఆ ప్రాంతాల నుంచే ఎక్కువ.. అప్రమత్తం అవ్వాలని కేంద్రం సూచన!
ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ మెషినరీని పటిష్టం చేయాలని డీడీఎంఏ సూచించింది. బహిరంగ ప్రదేశాలలో అత్యంత జాగరూకతతో ఉంచడానికి తగిన సంఖ్యలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించింది.
ఢిల్లీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
కేంద్రం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 213 కరోనావైరస్ (Corona Virus) యొక్క ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మంగళవారం 11 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Granted Citizenship: 3,117 మంది ఆఫ్ఘన్, పాక్, బంగ్లాదేశ్ మైనారిటీలకు భారతీయ పౌరసత్వం: కేంద్రం
దీంతో మహారాష్ట్రలో రాష్ట్రంలో అటువంటి కేసుల సంఖ్యను 54కి తీసుకువెళ్లింది. రాజధానిలో ఓమిక్రాన్ కేసులు 57కి పెరిగాయి. ఢిల్లీ (Delhi), మహారాష్ట్ర (Maharashtra) లు దేశానికి అత్యధిక సంఖ్యలో కొత్త ఒమిక్రాన్ కేసులను ఈ ప్రాంతాల నుంచే వస్తున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 6,317 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 318 మరణాలు నమోదయ్యాయి. దేశం క్రియాశీల కేసుల (Active Cases) సంఖ్య ప్రస్తుతం 78,190 వద్ద ఉంది, ఇది 575 రోజులలో కనిష్ట స్థాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది.
- ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Christmas, Delhi, Omicron, Omicron corona variant