భారతీయులు అత్యంత వైభంగా జరుపుకునే పండుగల్లో హోలీ (Holi 2023) ఒకటి. ఈసారి మార్చి 8న హోలీ పండగను జరుపుకుంటారు. హోలీ రోజు.. ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటూ వేడుక చేసుకుంటారు. దక్షిణాదితో పోల్చితే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మరింత ఘనంగా పండగను జరుపుకుంటారు. ఐతే రాజస్థాన్‌లోని ఓగ్రామంలో మాత్రం హోలీ రోజున దీపావళి (Diwali) జరుపుకుంటారు. ఉదయపూర్ సమీపంలోని మెనార్ గ్రామంలో హోలీ రోజున టపాసుల మోత మోగుతుంది. పండగ రోజున గ్రామ యువకులంతా చేతుల్లో కాగడాలను పట్టుకొని.. గ్రామ కూడలికి చేరుకుంటారు. గెర్ కత్తులతో నృత్యం చేస్తూ.. టాపాసులను పేల్చుతారు. మొగలుల కాలంలో మొదలైన ఈ సంప్రదాయం.. ఏళ్ల తరబడి ఇంకా కొనసాగుతోంది.
Photos : ఆకాశంలో వింత .. 10 కేజీల మంచు ముద్ద.. ఆశ్చర్యంలో ప్రజలు
చరిత్రకారుడు మహేంద్ర భనావత్ మాట్లాడుతూ... మేనారియా కమ్యూనిటీకి చెందిన బ్రాహ్మణులు హోలీ రోజున దీపావళిని జరుపుకుంటారు. మహారాణా ఉదయ్ సింగ్ కాలంలో మొఘలులకు ఇక్కడ ఔట్ పోస్ట్ ఉండేదట. వారు చిత్తోర్‌గఢ్‌పై దాడి చేయాలని ప్లాన్ చేసినప్పడు... ఆ విషయం తెలుసుకున్న మేనరియా బ్రాహ్మణ సమాజానికి తెలిసింది. వారు క్షత్రియుల మాదిరిగా పోరాడి మొఘల్ సైన్యాన్ని అక్కడి నుంచి తరిమికొట్టారు. జమ్రా బీజ్ రోజున మొఘలులపై విజయం సాధించినందుకు... ఇక్కడ ప్రతి ఏటా హోలీ పండగను ఘనంగా జరుపుకుంటారు.
Wow: ధోతీ, కుర్తా ధరించి క్రికెట్ మ్యాచ్.. సంస్కృతంలో కామెంట్రీ.. ఎక్కడో తెలుసా..?
మేనార్ గ్రామంలో హోలీ రోజు దీపావళి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. గ్రామంలోని ఇళ్లన్నీ దీపాలతో అలంకరిస్తారు. అనంతరం సంప్రదాయ వస్త్రాలు ధరించి.. హోలీ వేడుకలో పాల్గొంటారు. పురుషులు తెల్లటి ధోతీ కుర్తా ధరిస్తారు. విజయగీతాలు పాడుతూ పురుషుల వెనుకనే స్త్రీలు నడుస్తారు. దాదాపు 400 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని బ్రాహ్మణ సమాజానికి చెందిన వారు పాటిస్తున్నారు.
మేనార్ గ్రామంలోని గ్రామస్తులు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని బాగా పాటిస్తున్నారు. దీపావళికి బదులు హోలీ రోజున పటాకులు పేల్చడానికి ఇదే కారణం. ఇక్కడ హోలీ పండగ దీపావళిలా అనిపిస్తుంది. ఇక్కడ లక్షలాది రూపాయల విలువైన పటాకులు కాల్చుతారు. గాల్లోకి తుపాకులతో కాల్పులు జరుపుతారు. కానీ ఇన్నేళ్లలో ఎలాంటి అపశృతి జరగకపోవడం...ఎవరికీ గాయాలు కాకపోవడం.. మేనార్ గ్రామ హోలీ ప్రత్యేకత..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.