గురుగ్రామ్ లో కిడ్నాప్..ఢిల్లీలో గ్యాంగ్ రేప్

Shiva Kumar Addula | news18
Updated: May 30, 2018, 5:43 AM IST
గురుగ్రామ్ లో కిడ్నాప్..ఢిల్లీలో గ్యాంగ్ రేప్
  • News18
  • Last Updated: May 30, 2018, 5:43 AM IST
  • Share this:


పోలీసులంటే లెక్కలేదు.. చట్టాలంటే భయం లేదు.. కఠిన శిక్షలు విధిస్తున్నా..  మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఓ చోట అత్యాచార పర్వాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో కీచక పర్వం వెలుగుచూసింది.  రాత్రి వేళ ఓ  షాపింగ్ మాల్ బయట ఉన్నమహిళను కిడ్నాప్ చేసి..నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. గెస్ట్ హౌజ్ లో బంధించి పశువాంఛను తీర్చుకున్నారు.

సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గురుగ్రామ్ లోని సహార మాల్ ముందు 30 ఏళ్ల మహిళ నిలబడి ఆటో కోసం ఎదురుచూస్తోంది.  ఆ సమయంలో అటుగా వచ్చిన క్యాబ్ డ్రైవర్  తాను దిగబెడతానని చెప్పాడు. అతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో.. అమె నిరాకరించింది. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా  కారులోకి ఎక్కించారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతానికి వెళ్లి.. ఓ గెస్ట్ హౌజ్ లో బంధించారు. మరో ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు. మొత్తం ఐదు మంది కలిసి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను గదిలో బంధించి బయటి నుంచి గడియ పెట్టారు.

సాయం కోసం ఆమె కేకలు పెట్టడంతో.. గెస్ట్ హౌజ్ లో పనిచేస్తున్న వంట మనిషి తలుపు తీశాడు. ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు  ప్రయత్నించడంతో నిందితుల్లో ఒకరు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆమెకు దొరికిన  ఇనుప రాడ్ తో.. వారిపై దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుంది. ఫ్రెండ్ కు కాల్ చేసి.. ఇద్దరు కలిసి ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్,  అత్యాచారం కేసులు పెట్టారు.నిందితుల పేర్లు తేజ్ వీర్ సింగ్, గోపాల్ ప్రసాద్, రూప్ దేవ్, అన్షూల్, రాంబాబు. వీళ్లంతా హర్యానాకు చెందినవారు. వీళ్లలో ఇద్దరు ప్రముఖ క్యాబ్ సంస్థలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: May 30, 2018, 5:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading