స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారంతో భారతదేశాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఏ ప్రాంతంలో చూసినా పరిసరాల పరిశుభ్రతతో కళకళలాడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు, నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు నెట్వర్క్ 18, రెకిట్ (Reckitt) కలిసి మిషన్ పానీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. సహజ వనరు అయిన నీటిపైనే ప్రతి ఒక్కరి మనుగడ ఆధారపడి ఉంటుంది. అలాంటి నీటిని ఆదా చేయాలని ప్రోత్సహించడానికే ఈ మిషన్ పానీ ప్రచార ముఖ్య ఉద్దేశం. అయితే తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) మిషన్ పానీ (Mission Paani) ప్రచారంలో పాల్గొని స్వచ్ఛమైన నీరు, మరుగుదొడ్ల గురించి తన వంతుగా అవగాహన కల్పించారు. స్వచ్ఛమైన నీరు, సురక్షితమైన మరుగుదొడ్లు పౌరుల హక్కు అని.. ఈ సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. నీటి సంరక్షణ, పారిశుద్ధ్య కోసం చేపట్టిన వివిధ ప్రభుత్వ, ఇతర సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
హార్పిక్ – న్యూస్ 18 కలిసి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మిషన్ పానీ క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి. నీటిని పొదుపు చేయడం, రాబోయే తరాలకు నీటిని అందించడమే దీని లక్ష్యం. దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన మానవ హక్కుల సమస్యలలో స్వచ్ఛమైన నీరు, సురక్షితమైన టాయిలెట్స్ ఒకటి. సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన టాయిలెట్స్ తో దేశం ఆరోగ్యంగా మారుతుంది. దీనిని ముందుకు తీసుకెళ్తూ.. నెట్వర్క్18, రెకిట్ కలిసి మిషన్ పానీ ద్వారా పారిశుధ్యం కోసం ఇండియాలో తొలి ప్రతిజ్ఞ చేశాయి.
గ్రామీణ మహిళలు స్వచ్ఛమైన నీటి కొరతతో ఎక్కువగా ప్రభావితమవుతున్నారని, వారు తాగునీటి కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని ఓం బిర్లా చెప్పారు. నీటి కొరత పరిష్కారానికి కార్యక్రమాలతోపాటు నిరుపేద గ్రామాల్లో మహిళల కమిటీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని తెలిపారు. మహాత్మా గాంధీ ఆచరించినట్లే ప్రజలు స్వచ్ఛతా అభియాన్‌ను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని లోక్‌సభ స్పీకర్ తెలిపారు.
Mission Paani | భారతదేశంలో తాగునీరు ఎంతమందికి అందుబాటులో ఉందో తెలుసా..?
మిషన్ పానీ ప్రతిజ్ఞ
ప్రఖ్యాత గేయ రచయిత కౌసర్ మునీర్ రచించిన 'అందరికీ పారిశుధ్యం: సురక్షిత మరుగుదొడ్లు, సురక్షితమైన నీరు, సురక్షితమైన దేశం' దేశంలో వ్యక్తిగతంగా, సమాజ స్థాయిలో సమిష్టిగా ప్రతిజ్ఞ చేసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక, సామాజిక రంగాలలో, కార్యాలయాలలో ఇంటిలో శుభ్రతను పాటించాలి అన్నారు. సహజ వనరులు అందుబాటులో లేని స్త్రీ పురుషులు, కులాలు, సామాజిక తరగతులు, వెనుకబడిన ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ప్రతిజ్ఞ చేయాలి. ఈ ప్రతిజ్ఞ స్వచ్ఛ భారత్ మిషన్, ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 3, 6, 10తో పాటు ఎవరూ వెనుకబడిపోకుండా ఉండేలా అవగాహన కల్పించడానికి పాటుపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.