కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బు.. నోట్లు రద్దయిన విషయం తెలియక..

కూతురు విమల పెళ్లి కోసం డబ్బు కూడబెట్టేందుకు భార్య ఉష కూలిపనులకు వెళ్లేది. అలా కాయకష్టం చేసి సంపాదించిన డబ్బు రూ.35,500ను ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇంటి వెనుక గుంత తవ్వి పాతిపెట్టింది.

news18-telugu
Updated: July 12, 2020, 10:33 PM IST
కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బు.. నోట్లు రద్దయిన విషయం తెలియక..
రద్దయిన నోట్లను చూపుతున్న భార్యాభర్తలు
  • Share this:
తమిళనాడులో వింత ఘటన చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసి దాదాపు నాలుగేళ్లు పూర్తయ్యింది. అయినా ఆ నోట్ల రద్దు తాలూకు గుర్తులు ఇంకా అక్కడోఇక్కడో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓ వృద్ధ దంపతులు.. కూలీ పనులకు వెళ్లి కాయకష్టం చేసి కూతురు పెళ్లి కోసం కొంత నగదును కూడబెట్టాడు. ఆ నగదును భద్రంగా ఇంటి వెనుక గోయ్యి తవ్వి పాతిపెట్టారు. కానీ ఇటీవల నిర్మాణ పనులు చేసే క్రమంలో ఆ డబ్బు బయటపడింది. కానీ అవి రద్దయిన నోట్లు అని తెలియడంతో ఆ వృద్ధ దంపతుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగపట్టణం జిల్లా కొళ్లిడం సమీపంలోని పట్టియమేడుకు చెందిన రాజదురై, ఉష భార్యభర్తలు. వీరి కూతురు విమల బధిరులు. అయితే కూతురు విమల పెళ్లి కోసం డబ్బు కూడబెట్టేందుకు భార్య ఉష కూలిపనులకు వెళ్లేది. అలా కాయకష్టం చేసి సంపాదించిన డబ్బు రూ.35,500ను ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇంటి వెనుక గుంత తవ్వి పాతిపెట్టింది.

ఇటీవల రాజదురైకి అక్కడి ప్రభుత్వం ఇల్లును మంజూరు చేసింది. దీంతో కూలీలు నిర్మాణ పనుల కోసం తవ్వుతుండగా వారికిఓ ప్లాస్టిక్ సంచి దొరికింది. దాన్ని గమనించిన రాజదురై భార్య ఉష.. అది కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అని చెప్పింది. ఆ ప్లాస్టిక్ సంచిని ఓపెన్ చేసి చూసిన వారికి షాక్ తగిలినంత పని అయ్యింది. ఎందుకంటే ఆ సంచిలో ఉన్న నగదంతా రద్దయిన పాత వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లు. నోట్లు రద్దయిన విషయం.. నేటికీ ఉషకు తెలియకపోవడం గమనార్హం. ఆమె దాచుకున్న డబ్బంతా రద్దయిన నోట్లనీ చెప్పడంతో ఉషగా కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రభుత్వం స్పందించి తమ డబ్బులను మార్చుకునేలాగా చూడాలని వారు కోరుతున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 12, 2020, 8:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading