Home /News /national /

OLD AGE PEOPLE DUMPED BY MUNICIPAL WORKERS IN INDORE MAKES CONTROVERSY CM TAKES ACTION HSN

CM Shivraj Singh Chouhan- Indore: వీళ్లకసలు జాలే లేదా..? ముసలోళ్లను ట్రాక్టర్లో కుక్కి.. సిటీకి దూరంగా తీసుకెళ్లి..

వృద్ధులను ట్రక్కుల్లోకి ఎక్కిస్తున్న మున్సిపల్ సిబ్బంది

వృద్ధులను ట్రక్కుల్లోకి ఎక్కిస్తున్న మున్సిపల్ సిబ్బంది

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగుచూసిన ఓ ఘటన మానవత్వం ఉన్నవారిని కదిలిస్తోంది. ఇండోర్ మున్సిపాల్టీ సిబ్బంది చేసిన నిర్వాకం నెట్టింట తెగ వైరల్ అయింది. అది కాస్తా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లడంతో, ఆయన వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
    బతుకుదెరువు కోసం నగరాలకు వలస వచ్చి, ఉండటానికి ఇల్లు లేక, వేలకు వేలు అద్దె చెల్లించలేక ఎంతో మంది రోడ్ల పక్కనే గుడారాలు వేసుకుని నివసిస్తుంటుంటారు. ఇక ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బిచ్చమెత్తుకునేవాళ్లు, అన్నార్థులు వందలాది మంది ఫుట్ పాత్ లపైనే నిద్రపోతుంటారు. రైల్వేస్టేషన్ల వద్ద, బస్టాండుల వద్ద రాత్రయితే చాలు ఫుట్ పాత్ పైన ఓ చాప పరుచుకుని నిండా దుప్పటికప్పుకుని రాత్రి గడిస్తే చాలు అన్నట్టుగా బతికే వారు ఎందరో. అలాంటి వారి కోసం కొన్ని నగరాల్లో షెల్టర్లను నిర్మించారు కానీ, మెజార్టీ నగరాల్లో మాత్రం ఫుట్ పాత్ నే నమ్ముకుని కమ్మగా నిద్రపోతున్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగుచూసిన ఓ ఘటన మానవత్వం ఉన్నవారిని కదిలిస్తోంది. ఇండోర్ మున్సిపాల్టీ సిబ్బంది చేసిన నిర్వాకం నెట్టింట తెగ వైరల్ అయింది. అది కాస్తా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లడంతో, ఆయన వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..



    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చాలని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టింది. ఇంత వరకు బాగానే ఉంది. కాకపోతే గ్రీన్ సిటీ పేరుతో ఫుట్ పాత్ పై నివసిస్తున్న వృద్ధులపై మున్సిపాల్టీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. వారిని బలవంతంగా ఓ ట్రక్కులోకి ఎక్కించారు. సిటీ మొత్తం జల్లెడ పట్టి ఫుట్ పాత్ నే ఆధారంగా చేసుకుని బతుకుతున్న వృద్ధులను వాహనంలోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆ ట్రక్కును సిటీకి దూరంగా ఓ గ్రామ శివారులో వదిలేశారు. చలికి వణికిపోతారని తెలిసి కూడా వారిని నిర్దయగా ఓ గ్రామ శివారులో నడిరోడ్డుపైనే దించేశారు. వారికి ఎక్కడైనా ఆశ్రయం ఇచ్చి ఉంటే ఇది వివాదాస్పదం అయి ఉండేది కాదు. కానీ వారు చేసిన నిర్వాకం పట్ల నెటిజన్లు రగిలిపోయారు.



    ఇండోర్ మున్సిపాల్టీ సిబ్బంది చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మున్సిపాల్టీ సిబ్బందిపైనే కాకుండా, ప్రభుత్వంపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు తెలిసింది. దీంతో ఆ మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ సోలంకిని సస్పెండ్ చేసి, భోపాల్ అర్బన్ డవలప్మెంట్ డైరెక్టరేట్ కు అటాచ్ చేశారు. అంతే కాకుండా ఇద్దరు మున్సిపల్ కార్మికులను కూడా సర్వీసు నుంచి తొలగించారు. అంతే కాకుండా అలా నడిరోడ్డుపై వదిలివేయబడిన వృద్ధులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆశ్రయానికి తరలించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Indore, Madhya pradesh, VIRAL NEWS, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు