దున్నపోతుల కొమ్ములకు మసాజ్... రూ.16 లక్షలు హాంఫట్... లాలూ నిర్వాకం...

Lalu Prasad Yadav : కొందరు రాజకీయ నాయకులు డబ్బులు నొక్కెయ్యడానికి ఎక్కడ ఏ సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తారు. ఇది అలాంటిదే. దాణా కుంభకోణంలో ఓ కొత్త కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 29, 2019, 8:12 PM IST
దున్నపోతుల కొమ్ములకు మసాజ్... రూ.16 లక్షలు హాంఫట్... లాలూ నిర్వాకం...
లాలూ ప్రసాద్
  • Share this:
బీహార్‌ చరిత్రలో దాణా కుంభకోణం ఓ చీకటి అధ్యాయం. పసువులకు దాణా పేరుతో... వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించారు. అదే కేసులో మరో కోణం ఇప్పుడు బయటికొచ్చింది. అదేంటంటే... 1990 నుంచీ 1996 వరకూ... బీహార్‌లో దున్నపోతుల కొమ్ములకు మెరుగు (పాలిష్ చెయ్యడం) పట్టేందుకు రూ.16 లక్షలు ఖర్చుపెట్టి... 49వేల 950 లీటర్ల ఆవ నూనె కొన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇంతకంటే విడ్డూరం ఉంటుందా. దున్నపోతుల కొమ్ములకు ఎవరైనా పాలిష్ చేస్తారా. రాజకీయ నేతలు, అధికారులు, అక్రమార్కులంతా కలిసి... ఇలాంటి అడ్డమైన నకిలీ బిల్లులు పెట్టి... ప్రభుత్వ ధనాన్ని దోచేశారన్న ఆరోపణలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి.

ఈ తంతు ఇక్కడితో అయిపోలేదు. గొర్రెలు, పందులు, కోళ్లు, మేకలకు దాణా పెట్టేందుకు రూ.253 కోట్లు ఖర్చైనట్లు లెక్కలున్నాయి. సరే నిజంగానే వాటికి దాణా పెట్టారని అనుకుందాం. ఇక్కడో కిటుకుంది. ఏంటంటే... రూల్స్ ప్రకారం పాలు ఇచ్చే, మాంసంగా ఉపయోగపడే జంతువులకు దాణాలో 10 శాతం జొన్నలు కలపాలి. వాళ్లు ఏకంగా 115 రెట్లు అధికంగా జొన్నలు కలిపినట్లు లెక్కల్లో రాశారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా... రూ.154 కోట్లు. అంటే... అడ్డమైన నకిలీ బిల్లులతో ఈ డబ్బంతా దోచేశారన్నమాట. లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇలాంటివి ఎన్నో జరిగాయని ఇప్పటి నితీశ్ కుమార్ ప్రభుత్వం మండిపడుతోంది.

ఈ దాణా కుంభకోణం కేసులో రూ.658 కోట్లు పక్కదారి పట్టాయన్నది ఓవరాల్‌గా తెలిసిన విషయం. ఐతే... ఇందుకు సంబంధించిన రకరకాల కేసులు ఇప్పటికీ పాట్నా, రాంచీలోని సీబీఐ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అవి పరిష్కారం అయ్యేటప్పటికి మరో జన్మ ఎత్తాలేమో.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు