పొలంలో నూనె లోడుతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా.. జనాలు ఏం చేశారంటే..

పొలంలో నూనె లోడుతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా.. జనాలు ఏం చేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం(Image-Twitter)

వంట నూనె లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నారు.

 • Share this:
  వంట నూనె లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి కారుతున్న నూనెను డబ్బాలకు ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురిలో చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం ఉదయం గుమ్మడిపూండి నుంచి కృష్ణగిరి జిల్లా రాయకోట్టైలోని ప్రైవేట్‌ వంట నూనె శుద్ధీకరణ పరిశ్రమకు ట్యాంకర్ వంట నూనెతో బయలుదేరింది. అయితే ధర్మపురి- కృష్ణగిరి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ట్యాంకర్ అదుపుతప్పింది. పక్కనే వరి పొలంలోకి దూసుకెళ్లి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి.

  వరి పొలంలో నూనె ట్యాంకర్ బోల్తా పడిందని.. ట్యాంకర్ నుంచి నూనె బయటకు కారుతుందని తెలుసుకున్న స్థానికులు అక్కడి పెద్ద ఎత్తున్న చేరుకున్నారు. పొలంలోకి దిగి వంట నూనెను చోరీ చేశారు. బిందెలు, ఇతర పాత్రల్లో వంట నూనెను ఇళ్లకు తీసుకెళ్లారు. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు వంట నూనె తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. వరి పొలంలో నుంచి ట్యాంకర్‌ను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు ఆరా తీస్తున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు