హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Omicron cases in india: పెరిగిపోతున్న ఒమిక్రాన్ కరోనా​ బాధితులు..11 రాష్ట్రాలకు విస్తరించినట్లు అధికారులు వెల్లడి.. 

Omicron cases in india: పెరిగిపోతున్న ఒమిక్రాన్ కరోనా​ బాధితులు..11 రాష్ట్రాలకు విస్తరించినట్లు అధికారులు వెల్లడి.. 

ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్​లో ఒమిక్రాన్ (Omicron)​ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక భారత్​లోనూ ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి.

ఇంకా చదవండి ...

  దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఈ కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్​ల కంటే సెకండ్​ వేవ్​లో భారత్​లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం (delta variant) అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ (Omicron)​ వైరస్​పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్​లో ఒమిక్రాన్ (Omicron)​ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక భారత్​లోనూ ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసులు ఇప్పటికే 111 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

  ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ తర్వాత రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8 గుజరాత్‌లో 5 కేరళలో 5 కేసులు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదూనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

  దేశంలో కోవిడ్ పరిస్థుతలపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ పలు  అంశాలను వెల్లడించారు. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారి కోవిడ్ కేసుల్లో 2.4 శాతం ఈ వేరియంట్ కేసులేనని తెలిపారు.

  వేగవంతమైన రేటు..

  WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘  ప్రస్తుత పరిమిత డేటాను పరిశీలిస్తే ఒమిక్రాన్​ మునుపటి వేరియంట్‌తో చూడనటువంటి వేగవంతమైన రేటును వ్యాప్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన డేటాను చూస్తే ఓమిక్రాన్‌తో రీఇన్‌ఫెక్షన్ పెరిగే ప్రమాదాలను సూచిస్తుంది”అని అన్నారు.

  ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చ‌రించింది. ఈ దేశాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, వ్యాప్తి అడ్డుకొట్ట‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌డితే మంచిద‌ని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  ఉత్తమ కథలు