• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • OFFICIALS PLANS TO PUT CCTV CAMERAS TO PROTECT COW DUNG IN CHHATTISGARH SU

ఆవు పేడ రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు..! ఎక్కడో తెలుసా..?

ఆవు పేడ రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు..! ఎక్కడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ఆవు పేడ రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలేమిటని ఆశ్చర్యపోతున్నారా?. అవును మీరు చదువతున్న నిజమే.. ఆవు పేడకు ఉన్న డిమాండ్ ఆ పని చేయించింది.

  • Share this:
    ఆవు పేడ రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలేమిటని ఆశ్చర్యపోతున్నారా?. అవును మీరు చదువతున్న నిజమే.. ఆవు పేడకు ఉన్న డిమాండ్ ఆ పని చేయించింది. అది మరెక్కడో కాదు పక్క రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్‌లోనే. వివరాలు.. ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం 2020లో గోధాన్ నయా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రకారం ప్రభుత్వమే.. రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇలా గ్రామాల నుంచి ఆవుపేడను సేకరిస్తోంది. సేకరించిన పేడను సహకార సంఘాల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి రైతులకు విక్రయిస్తుంది. ఇందుకోసం సహకార సంఘాలకు రుణాలు కూడా ఇస్తుంది. దీంతో ఛత్తీస్‌ఘడ్‌‌లో ఆవు పేడకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అక్కడ ఆవు పేడ విలువైన వస్తువుగా మారిపోయింది. ఆవు పేడ కోసం దొంగతనం చేసే స్థితి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ఇక, ఇటీవల అంబికాపూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ గోధాన్ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగతనం చేస్తున్న ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఆవుపేడ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో గోదాన్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

    ఈ క్రమంలోనే గోదాన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అలాగే భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు