గుజరాత్(Gujarat)మోర్బీలో బ్రిటీష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి(Cable bridge)కూలిపోవడానికి కారణాలు కనుగొనే పనిలో అధికారులు ఉన్నారు. అయితే బ్రిడ్జి ఆధునీకరణ పనుల కోసం గత ఆరు నెలలుగా వంతెన పైకి సందర్శకుల్ని అనుమతించ లేదు. పనులు పూర్తి చేసిన తర్వాత గత ఐదు రోజుల నుంచి సందర్శకుల్ని అనుమతించారు. అయితే మచ్చు నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం(Sunday)సాయంత్రం ఎక్కువ మంది నడవటంతో పాటు జన సాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వంతెన పటిష్టతను చెక్ చేయడానికే బ్రిడ్జీపై నుంచి నడుస్తూనే కొందరు తోసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. ఈక్రమంలోనే కేబుల్ బ్రిడ్జీ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందనే విధంగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియో ప్రమాదం జరిగే ముందు తీసింది కాదని..పాత వీడియో అని తెలుస్తోంది.
పోకిరి వెదవల వల్లే ప్రమాదమా..!
దుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై స్తానికులతో పాటు సందర్శకులు మొత్తం కలిపి 500మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈప్రమాదంలో ఇప్పటి వరకు 91మంది చనిపోయారని గుజరాత్ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బ్రిజేష్ మీర్జా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఘటన స్తలానికి చేరుకున్న మంత్రి పోలీసులు సహాయక బృందాలతో రక్షణ చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు.
91మంది మృతి..
మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వంతెనపై అధిక జనాభా ఎక్కవడం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలోనే అధికారులు ఆరా తీస్తున్నారు.
సంచలనం వార్త ..
సంచలనంగా మారిన ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతి చెందిన వాళ్లకు పరిహారం అందజేస్తామని తెలిపారు. గుజరాత్ సీఎంతో సహాయచర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
కుప్పకూలిన వంతెన..
నదిలో కుప్పకూలిన వంతెన సుమారు 140సంవత్సరాల క్రితం బ్రిటీష్ కాలంలో నిర్మించినది. ఈ కేబుల్ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు ఇటీవలే పూర్తి చేశారు. ఐదు రోజుల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. సందర్శకుల్ని అనుమతిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రమాదం జరగినట్లుగా గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. నదిలో పడిపోయిన వాళ్లలో 70 మందిని కాపాడామని వెల్లడించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వంతెన కూలిపోయిన వెంటనే చాలామంది నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, National News