ముంబై (Mumbai) కార్డీలియా క్రూయిజ్ (Cruise) షిప్ (Ship) లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (Narcotic control bureau) అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. తాజాగా మరో 8 మందిని ఎన్సీబీ (NCB) అదుపులోకి తీసుకుంది. మఫెడ్రోన్ అనే మాదక ద్రవ్యాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బాంద్రా (Bandra), అంధేరీ (Andheri), లోఖండ్‌వాలా ప్రాంతాల్లో ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక మాదక ద్రవ్యాల (narcotics) పంపిణీదారుని ఎన్‌సీబీ (NCB) అధికారులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యక్తికి షిప్ (ship) లో రేవ్ పార్టీ (Rave party)కి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబయి డ్రగ్స్ పార్టీ (Mumbai drug party)లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అదువులో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు న్యాయస్థానం విధించిన ఒక్క రోజు కస్టడీ ముగియనుండటంతో ఇవాళ కిల్లా కోర్టు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్‌ఎం నిర్లాంకర్ ఎదుట హాజరుపర్చారు. ఆర్యన్ ఖాన్ తరఫున న్యాయవాది సతీష్ మానెషిండే కేసును వాదించనున్నారు. ఆదివారం రేవ్ పార్టీకి సంబంధించి ఎన్సీబీ 8 మందిని అదుపులోకి తీసుకుంది. నిన్న అరెస్టయిన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు ముగ్గురు నిందితులకు ఈ నెల 7 వరకు ఎన్‌సీబీ కస్టడీకి ముంబయి సిటీ కోర్టు అనుమతించింది. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
మూడు రోజుల పార్టీ..
శనివారం రాత్రి అత్యంత విలాసవంతమైన కార్డీలియా క్రూయిజ్ లైనర్ ముంబై నుంచి గోవాకు బయలుదేరింది. రెండు వారాల కిందటే ఈ క్రూయిజ్ లైనర్ సర్వీసులు ప్రారంభమవగా.. శనివారం పార్టీ కోసం ఏకంగా క్రూయిజ్‌నే అద్దెకు తీసుకున్నారు. నమస్క్రే ఎక్స్‌పీరియెన్స్, ఫ్యాషన్ టీవీ సంయుక్తగా క్రూయిజ్ షిప్‌లో మూడు రోజుల పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్టోబరు 2 నుంచి 4వ తేదీ వరకు పార్టీ జరగాల్సి ఉంది. కానీ అంతలోనే ఎన్సీబీ దాడులు చేసింది. పార్టీలో పాల్గొన్న వారిలో అందరూ బడా బాబుల పిల్లలే ఉన్నారు. క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీకి దాదాపు 1,500 మంది వరకు హాజరైనట్టు సమాచారం. వారంతా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి డ్రగ్స్ (drugs) తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీ (rave party) గురించి ఎన్సీబీకి సమాచారం అందడంతో..NCB ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని టీమ్ క్రూయిజ్‌లో దాడులు చేసింది. అనంతరం కొకైన్, హషీష్, ఎండీఎంఏను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
11 వరకు కస్టడీ..
క్రూజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ (Drugs) వినియోగం వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ (Aryan Khan) సహా మొత్తం ఎనిమిది మందిని నిన్న పోలీసులు (police) అరెస్టు చేశారు. వీరందరినీ సోమవారం మధ్యాహ్నం సిటీ కోర్టు (city court)లో ప్రవేశపెట్టారు అధికారులు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఆర్యన్ ఖాన్‌తో పాటు నిందితులను ఈ నెల 11 వరకు కస్టడీ (custody)కి ఇవ్వాలని ఎన్‌సీబీ (NCB) కోరింది. ఈ అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు. తాను నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆర్యన్ ఎన్‌సీబీకి తెలిపినట్లు సమాచారం. అతను యూకే, దుబాయ్, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ (Drugs) తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
అయితే అంతకుముందు షారుక్ ఖాన్ (Shahrukh Khan)... కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో అతను కంటిన్యూ (continue)గా ఏడుస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.