Home /News /national /

OFFENSIVE WORDS AGAINST BHARAT MATA BHUMA DEVI ATTRACT OFFENCE UNDER SECTION 295A IPC MADRAS HIGH COURT CATHOLIC PRIEST GEORGE PONNIAH GH VB

Offensive Words: భారతమాత, భూదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. దీనిపై హైకోర్టు సంచలన తీర్పు..

మద్రాస్ హైకోర్టు

మద్రాస్ హైకోర్టు

జాతీయవాద, మతపరమైన సెంటిమెంట్లపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక తీర్పు ఇచ్చింది. భారతమాత, భూ మాతపై చేసే అభ్యంతరకర వ్యాఖ్యలు మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తాయని కోర్టు అభిప్రాయపడింది.

జాతీయవాద, మతపరమైన సెంటిమెంట్లపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక తీర్పు ఇచ్చింది. భారతమాత, భూ మాతపై చేసే అభ్యంతరకర వ్యాఖ్యలు మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తాయని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌(IPC Secetion) 295A ప్రకారం నేరమని మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలో క్యాథలిక్‌ ప్రీస్ట్‌ జార్జ్‌ పొన్నయ్యపై(Ponnaiah) దాఖలైన FIRను కొట్టేసేందుకు హైకోర్టు (High Court) తిరస్కరించింది. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది జూలై 18న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా (Kanyakumari District) అరుమనై పట్టణంలో హక్కుల కార్యకర్త, దివంగత ఫాదర్‌ స్టాన్‌ స్వామి శ్రద్ధాంజలి కార్యక్రయాన్ని కొందరు నిర్వహించారు. ఈ సందర్భంగా అసభ్యకరమైన, రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు జార్జ్‌ పొన్నయ్యపై కేసు దాఖలైంది. ఆయన చేసిన ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దానిపై FIR నమోదైంది. ఈ FIRను కొట్టేయాలని కోరుతూ ఆయన క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 482 కింద మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

Unsolved Mysteries: ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ ఛేదించని మిస్టరీలు ఇవే.. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..


ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ GR స్వామినాథన్‌ స్పందిస్తూ.. “భూమాతపై భక్తి భావంతో కాళ్లకు చెప్పులు లేకుండా నడిచే వారిని పిటిషనర్‌ ఎగతాళి చేశారు. కాళ్లకు గజ్జి సోకకుండా చూసేందుకు క్రిస్టియన్లు షూస్‌ ధరిస్తారని అన్నారు. ఆయన మాటల ప్రకారం భూదేవి, భారతమాత అనేవారు ఇన్ఫెక్షన్‌, మురికికి ప్రతిరూపాలు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు ఇంత కంటే పెద్ద మాటలు ఉండవు. పౌరుల మతపరమైన భావనలు, నమ్మకాలపై దాడి జరిగిన సందర్భంలో IPC సెక్షన్‌ 295A వర్తిస్తుంది. హిందువులందరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేదు. హిందువుల్లోనే ఒక వర్గం వారి మతపరమైన భావనలు, నమ్మకాలకు విఘాతం కలిగినా ఈ సెక్షన్‌ వర్తిస్తుంది” అని వ్యాఖ్యానించారు.

‘భారతమాతపై హిందువుల్లో చాలా మందికి అపారమైన భక్తిభావం ఉంది. జాతీయ పతాకం చేతపట్టిన ఆమెను సింహ వాహనంపై చాలా సందర్భాల్లో చూపుతారు. చాలా మంది హిందువులకు ఆమె దేవత. భారతమాతను, భూమాతను అత్యంత అభ్యంతరకరమైన పదాలతో దూషించినందుకు IPC సెక్షన్‌ 295A కింద పిటిషనర్‌ నేరానికి పాల్పడ్డారు’ అని జస్టిస్‌ స్వామినాథన్‌ పేర్కొన్నారు.

దేశాన్ని దేవతతో సమానంగా చూపిన బంకిమ్‌ చంద్ర ఛటోపాధ్యాయ నవల ఆనంద్‌మఠ్‌లోని వందేమాతరం గేయాన్ని ఉటంకిస్తూ న్యాయమూర్తి తన తీర్పు వెలువరించారు. మతపరంగా తాను విమర్శించానని పిటిషనర్‌ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. హిందూ మతాన్ని విమర్శిస్తూ డాక్టర్‌ అంబేడ్కర్‌ చేసిన రచనలను పిటిషనర్‌ ప్రస్తావించారు. అయితే అంబేడ్కర్‌ లాంటి ఎంతో గౌరవనీయ నాయకులతో పోల్చుకోవడం పిటిషనర్‌కు తగదని కోర్టు వ్యాఖ్యానించింది.

ఆ సందర్భాలు వేరు..
హేతువాది, విద్యావేత్త లేదా కళాకారులు మతం గురించి తీవ్రమైన వ్యాఖ్యలు వేరని, అదే మరో మతం గురించి బోధిస్తున్న వ్యక్తి వ్యాఖ్యలను అలా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. మత ప్రబోధకుడైన పిటిషనర్‌ వారితో సమానమైన గౌరవాన్ని పొందలేరని తెలిపింది. ఒక మతాన్ని లేదా మతపరమైన విశ్వాసాలను అవమానించి IPC సెక్షన్‌ 295A/153A/505(2) నుంచి రక్షణను పిటిషనర్‌ పొందలేరని న్యాయస్థానం పేర్కొంది. దీన్ని వదిలిస్తే హాని కలుగవచ్చని, ఇలాంటి పరిస్థితుల్లో న్యూటన్‌ మూడో సూత్రం ప్రతి చర్యకు సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్యగా ఉంటుందనేది మొదలు కావచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో రాజ్యం మౌనముద్ర దాల్చలేదని వ్యాఖ్యానించింది.

శాంతి భద్రతలు కాపాడేందుకు, రాజ్యాంగ పవిత్రత పరిరక్షించేందుకు మతసామరస్యాన్ని, స్నేహభావానికి విఘాతం కలిగించే వారి విషయంలో చట్టం తన బలమైన హస్తాన్ని ప్రయోగించక తప్పదని కోర్టు ప్రకటించింది. పిటిషనర్‌ ప్రసంగం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 153A కింద కూడా శిక్షార్హమని కోర్టు స్పష్టం చేసింది.

అంతే కాదు కన్యాకుమారి జిల్లాలో క్రిస్టియన్ల జనాభా అధికంగా ఉందనే విషయాన్ని కూడా న్యాయమూర్తి జస్టిస్‌ స్వామినాథన్‌ ప్రస్తావించారు. 1980 నుంచి ఈ జిల్లాలో హిందువులు మైనార్టీలుగా మారారని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా 48.5 శాతం ఉందని చెప్పినా వాస్తవంగా అలా లేదని కోర్టు తెలిపింది. చాలా మంది షెడ్యూల్‌ కులాలకు చెందిన హిందువులు క్రైస్తవ మతంలోకి మారినా రిజర్వేషన్లు పొందేందుకు రికార్డుల్లో ఇంకా హిందువులుగానే చెప్పుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తులను క్రిప్టో క్రిస్టియన్లు అంటారని కోర్టు తెలిపింది.

Chinese Phone Companies: చైనీస్ స్మార్ట్​​ ఫోన్ కంపెనీల నయా ప్లాన్.. విచారణలో నమ్మలేని నిజాలు..


మతాన్ని మార్చుకునే స్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ ఉందని దాన్ని గౌరవించాలని స్పష్టం చేసిన జస్టిస్‌ స్వామినాథన్‌, మత మార్పిళ్లు అనేవి గ్రూప్‌ అజెండాగా ఉండరాదని తెలిపారు. కన్యాకుమారి ప్రాంతంలో మారతున్న జనాభా పరిణామాల గురించి అరవింద్‌ నీలకంఠన్‌ రాసిన వ్యాసాన్ని న్యాయమూర్తి తన తీర్పులో విస్తృతంగా పేర్కొన్నారు. IPC సెక్షన్‌ 143, 269, 506 (1), అంటువ్యాధుల చట్టం 1897 సెక్షన్‌ 3 కింద నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టేసింది.
Published by:Veera Babu
First published:

Tags: Highcourt

తదుపరి వార్తలు