ఉత్తరాఖండ్ (Uttarakhand)-హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)సరిహద్దులో విషాదం నెలకొంది. హిమాలయాల్లో (Himalayas) పర్యాతారోహణ (Mountain trekking)కు వెళ్లిన ట్రెక్కర్స్.. వాతావరణం అనుకూలించగా మరణించారు. భారీగా కురుస్తున్న హిమపాతంలో చిక్కుకొని విలవిల్లాడారు. ఊపిరాడక అక్కడిక్కడే మరణించారు. మృతదేహాలను మంచు కప్పేయడంతో గుర్తించడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. సముద్ర మట్టానికి 17వేల ఎత్తులో ఉన్న లాంఖాగా కనుమల్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే ఆర్మీ (Indian Army), ఐటీబీపీ (ITBP) రంగంలోకి దిగింది. ప్రత్యేక హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు ప్రాణాలతో కాపాడారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 17 మంది పర్వాతారోహకుల బృందం అక్టోబరు 14న హిమాలయాల్లో పర్వాతారోహణకు వెళ్లింది. ఈ 17 మందిలో టూరిస్ట్‌లు, పోర్టర్లు, గైడ్స్ ఉన్నారు. అక్టోబరు 14న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా హార్సిల్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా చిత్కుల్కు బయలుదేరారు. వారు ట్రెక్కింగ్ చేసే ప్రాంతం హిమాచల్, ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉంటుంది. అక్టోబరు 17, 18 తేదీల్లో లంఖాగా పాస్ మీదగా వెళ్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విపరీతంగా మంచు కురిసింది. ఆ కఠిన పరిస్థితుల్లో ముందుకు వెళ్లేకపోయారు. అలాగని అక్కడ ఉండలేకపోయారు. మంచు బీభత్సానికి వారంతా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొందరు అక్కడికక్కడే మరణించారు. ప్రాణాలతో ఉన్న కొందరు టూరిస్ట్‌లు ఎస్‌వోఎస్ ద్వారా ఆర్మీకి సమాచారం అందించారు. ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
India Corona Updates: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... మరణాలు భారీగా పెరిగాయా?
అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో అక్టోబరు 21 నుంచి మంచు కొండలను గాలిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను అనుగుణంగా ఎంత ఎత్తుకు వీలైతే అంత ఎత్తుకు వెళ్లి జల్లెడ పడుతున్నారు. అదే రోజున నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అక్టోబరు 22 ఉదయం సముద్ర మట్టానికి 16,500 మీటర్ల ఎత్తులో మరో ఐదుగురి మృతదేహాలు దొరికాయి. సాయంత్రం మరో ఇద్దరి డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. విషమ పరిస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ బృందం కాపాడింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చనిపోయిన పర్యాటకుల మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. వారు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
శీతాకాలం ప్రారంభమవడంతో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తోంది. ఎడతెరిపి లేని మంచుతో రోడ్లుపై 2-3 అడుగుల మేర మంచు పేరుకుపోతోంది. హిమాచల్‌లోని లహోల్ స్పిటి జిల్లా బతాల్ ప్రాంతంలో పర్యాటకులు మంచులో చిక్కుకున్నారు. వారిని స్థానిక యంత్రాంగం రక్షించింది.
Himachal | Local admn rescued all tourists in Batal in Lahaul-Spiti dist who got stuck due to bad weather
We've rescued all stranded tourists. Local people & Army all played an imp role. We worked as a team& overcame all challenges & completed it: Mahendra Pratap Singh, Kaza SDM pic.twitter.com/9isPUOVhZ4
— ANI (@ANI) October 22, 2021
ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంచు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఇప్పటికే ట్రెక్కింగ్‌లో ఉన్న వారు వెంటనే బేస్ క్యాంప్‌లను చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Himachal Pradesh, Himalaya, Uttarakhand