హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Odisha : రిక్షా కార్మికుడికి కోట్ల రూపాయల ఆస్తి దానం.. బంధువులు చుట్టుముట్టినా కాదన్న మహిళ.. కారణం ఇదే.. !

Odisha : రిక్షా కార్మికుడికి కోట్ల రూపాయల ఆస్తి దానం.. బంధువులు చుట్టుముట్టినా కాదన్న మహిళ.. కారణం ఇదే.. !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Odisha : ఆస్తులు ఉంటేనే బంధువులు లేదంటే .. ఎవరిదారి వారిదే.. ఇలా ఆస్తి కోసం కోట్టుకుని చచ్చే లోకం తీరు ఉన్న ప్రస్తుత తరణంలో ఓ మహిళ తన ఆస్థిని తనకున్న వారిని ఎవ్వరిని కాదని ఓ రిక్షావాడికి రాసిచ్చింది.

ఒక్కోసారి కోట్ల రూపాయల ఆస్తి ఉన్న అది అనుభవించడానికి ఎవరు లేకపోవడం ఆ కుటుంబానికి నరకమే అవుతుంది. జీవిత కాలం కష్టపడి కూడబెట్టిన ఆస్తిని తన సంతానానికి ఇవ్వాలని కళలు కంటారు. వారు తమ లాగా భవిష్యత్‌లో కష్టపడకూడదని సగటు మానవుడు భావిస్తారు. ఇలా చాలా మంది తమతో పాటు తమ పిల్లల కోసమే కోట్ల రూపాయల ఆస్తిని కూడబెడతారు.

అయితే ఇలా సంపాదించి కూడబెట్టిన ఓ మహిళ తన బంధువులు పిల్లలకు ఎవరికి ఇవ్వకుండా తన కుటుంబం కోసం జీవిత కాలం కష్టపడిన ఓ రిక్షావాడికి రాసిచ్చింది. ఇలా తన బంధువులు, రక్తసంబంధికులను కాదని ఓ రిక్షాకార్మికుడికి ఇచ్చి ఆదర్శంగా నిలించింది.

ఇది చదవండి : హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఆ జంక్షన్‌లో 90 రోజుల పాటు ట్రాఫిక్ దారిమళ్లింపు.. పూర్తి వివరాలివే


వివరాల్లోకి వెళితే... ఒడిశాలో నివసించే 63 ఏళ్ల మినతి పట్నాయక్ తన కోటి రూపాయల విలువైన ఆస్తిని తనకు ఏ సంబంధం లేని ఓ రిక్షావాడికి రాసిచ్చేసింది.గతేడాది మినతి భర్త చనిపోయారు. ఇక మిగిలిన జీవితమంతా కూతురితోనే గడపాలి అనుకున్న మినతికి ఆ సంతోషం కూడా మిగలలేదు. తన భర్త చనిపోయిన ఆరు నెలల తర్వాత మినతి కూతురు కూడా గుండెపోటుతో మరణించింది. దీంతో తన జీవితం చీకటైపోయింది. తాను ఎవరి కోసం జీవించాలనే ఆలోచనకు వెళ్లిపోయింది.

అయితే అప్పటివరకు మినతి వద్దకు చేరని బంధువులు ఆమె ఆస్తి వారసత్వం కోసం పోటి పడ్డారు. ఎనాడు పట్టించుకోని వారు సైతం ఆప్యాయంగా మాట్లాడడం, ఇంటికి రావడం మొదలు పెట్టారు. దీంతో అసలు విషయం గమనించిన మినతి తన మనసును మార్చుకున్నారు. తన ఆస్థిని బంధువులకు పంచేందుకు ఆమె ఇష్టపడలేదు.. దీంతో తన కుటుంబం కోసం కష్టపడిని ఒకరికి ఆస్తిని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మినతి తన కూతురిని 25 ఏళ్లు రిక్షాలో స్కూలుకు, కాలేజీకి తీసుకెళ్లిన సామల్‌ అనే వ్యక్తిని పిలిపించింది. తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ సామల్ పేరు మీద రాసి ఇచ్చింది. దీంతో మినతి చేసిన పనిని విన్నవారు ఆశ్చర్యపోవడంతో పాటు తన గొప్ప మనసుని ప్రశంసిస్తున్నారు.

First published:

Tags: National News, Odisha

ఉత్తమ కథలు